చుట్టూ కొండలు, ఆకాశంలో నీలి మేఘాలు, ఆప్పుడే నిద్ర లేచాడన్నట్లుగా ఉన్న సూర్యుని లేలేత కిరణాలు, గోదావరి అలల సవ్వడులు ఈ అందాలన్నింటినీ ఆస్వాదిస్తున్నట్లుగా పచ్చిక బయళ్లపై వెనక్కి తిరిగి కూర్చున్న ఓ అమ్మాయి.. ఏంటీ పొయెట్రీ అనుకుంటున్నారా? అవునండీ మరి ఇంత అందాన్ని వర్ణించడం ఎలా? మాటలు సరిపోతాయా? 'రంగస్థలమ్ 1985' సినిమాలోని సమంత ఫస్ట్‌లుక్ ఇది, ఆ లుక్‌లోని అందమే ఈ వర్ణన. ఈ సినిమాలో సమంత పల్లెటూరి అమ్మాయిలా నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే సమంత గెటప్ ఎలా ఉండబోతోందంటూ అందరిలోనూ ఆశక్తి నెలకొంది. ఇదిగో చూడండి. సమంతని ఫ్రంట్ నుండి చూపించలేదు కానీ, వెనక్కి తిరిగి కూర్చున్న సమంతని చూస్తుంటేనే ఇంత అందంగా ఉంది. గోదావరి ఒడ్డున రిబ్బను జడ వేసుకుని లంగా వోణీలో కూర్చున్న సమంత అందం ఏమని వర్ణించగలం. 'రంగస్థలం' సినిమా షూటింగ్ సందర్బంగా తీసిన స్టిల్ ఇది. 1985 నాటి పల్లెటూరి పరిస్థితుల్ని, గోదావరి అందాల్ని అచ్చుగుద్దినట్లు అలాగే చూపించబోతున్నాడు దర్శకుడు అని ఈ ఫోటో చూస్తుంటేనే అర్ధమవుతోంది. సమంత షూటింగ్ స్పాట్‌లో చాలా చాలా ఎంజాయ్ చేస్తోందట. షూటింగ్ తాజా షెడ్యూల్ పూర్తి చేసుకుని, చిత్ర యూనిట్ గోదావరి పరిసర ప్రాంతాల నుంచి హైదరాబాద్‌కి షిఫ్ట్ అయ్యింది. వారం రోజులపాటు ఎవరికీ ఫోన్ సౌకర్యం కూడా లేదట. అయినప్పటికీ ఆ లోటు కనిపించడంలేదని అంటున్నారు. ఏదేమైనా సమంత లుక్ బ్యాక్‌సైడ్ నుంచే కనిపిస్తున్నా చాలా పొయెటిక్‌గా ఉంది. మిస్టర్ పెర్‌ఫెక్షనిస్ట్ సుకుమార్ దర్శకత్వం కదా, డిటెయిల్స్ అస్సలు మిస్ అవడంలేదు.