ఇటీవల అమేజాన్ లో విడుదలైంది `ఫ్యామిలీ మెన్ 2` వెబ్ సిరీస్. ఈ సిరీస్ ని సమంత వన్ ఉమెన్ షోగా అభివర్ణిస్తున్నారు. రాజీ పాత్రలో సమంత అందరినీ సర్‌ప్రైజ్ చేసింది. తన అసమాన్యమైన నటనతో కట్టిపడేస్తోంది. ఆ పాత్రని తీర్చిదిద్దిన విధానం, అందులో సమంత ఒదిగిపోయిన తీరుకు జనమంతా హ్యాట్సాఫ్ చెబుతున్నారు. నిజంగా.. సమంత కెరీర్ లో ఇదో మైల్ స్టోన్.
మరి ఈ రాజీ పాత్రకు గానూ సమంత ఎంత పారితోషికం తీసుకుంది? అనేది ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. సాధారణంగా సినిమాలకు గానూ సమంత పారితోషికం రూ.2 నుంచి రూ.2.5 కోట్ల వరకూ ఉంటుంది. కానీ ఈ వెబ్ సిరీస్ కోసం ఏకంగా 4 కోట్లు తీసుకుందట. ఈ వెబ్ సిరీస్ కోసం మంత కేటాయించిన కాల్షీట్లు 20కి మించి లేవని సమాచారం. ఆ 20 రోజుల్లోనే సమంత పై సన్నివేశాలన్నీ చిత్రీకరించేశారు. అంటే.. ఓసినిమాకి ఇచ్చే కాల్షీట్ల కంటే చాలా తక్కువే ఇచ్చిందన్నమాట. సినిమా కంటే ఎక్కువ పారితోషికం అందుకుందన్నమాట. ఇంతకంటే లాభసాటి బేరం ఉంటుందా?