సినిమాలలో ముందుగా అనుకున్న వారు కాకుండా ఆ స్థానంలో వేరే వారు రావడం సర్వ సాధారణం. అయితే ఆలాంటిది ఒక టెలివిజన్ ఛానల్ కి సంబందించిన విషయంలో జరిగింది.
వివరాల్లోకి వెళితే, ప్రముఖ టెలివిజన్ ఛానల్ కి బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న తమన్నా స్థానంలో అక్కినేని వారి కోడలు సమంతాని తీసుకున్నరాట. ఈ మార్పు ఇప్పుడు ఇండస్ట్రీలో పెద్ద చర్చనీయాంశంగా మారింది. సమంతా చేతిలో ఇప్పటికే అరడజనుకు పైగా బ్రాండ్ లు ఉండగా ఇప్పుడు ఇది కూడా తోడవ్వడంతో ఆమెకి క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు అని అర్ధమైంది.
సహజంగా పెళ్ళి అవ్వగానే సినిమాలు తగ్గడం, మార్కెట్ లో క్రేజ్ తగ్గడం వంటివి చూస్తుంటాము. కాని ఆశ్చర్యంగా సమంతా విషయంలో ఇది రుజువు కాలేదు. ప్రస్తుతం సమంతా తెలుగులో రంగస్థలం చిత్రంలో రామ్ చరణ్ సరసన నటిస్తున్నది.
మొత్తానికి అక్కినేని వారి కోడలు ఇప్పుడు ఇటు పర్సనల్ లైఫ్ లో అటు ప్రొఫెషనల్ లైఫ్ లో హ్యాపీగా ఉంది.