'మహానటి'లో సమంత కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి ఆమె పాత్ర ఎంత కీలకమో సినిమా చూడకుండానే, సమంత మాటల ద్వారా అర్ధమైంది. కేవలం ఆ ఒక్క సీన్ కోసమే సమంత ఈ సినిమాకి సైన్ చేసిందంటే, అది ఎంత బలమైన సన్నివేశమో అర్ధం చేసుకోవచ్చు.
అంతేకాదు, ఆ సన్నివేశంలో సమంత నటించలేదట. నిజంగానే జీవించేసిందట. గ్లిజరిన్ అవసరం లేకుండానే ఏడ్చేసిందట. ఆ విషయాన్ని చెబుతూనే సమంత భావోద్వేగానికి లోనైంది. ఇటీవల 'రంగస్థలం' సినిమాలోనూ సమంత ప్రాధాన్యత ఉన్న పాత్రను ఎంచుకుంది. ఇప్పుడు 'మహానటి'లో మధురవాణిగా ఆమె పాత్రకు ఎంత ప్రాధాన్యత ఉందో చిత్ర యూనిట్ అంతా ప్రత్యేకంగా చెబుతోంది.
మరో పక్క సమంత 'యూ టర్న్' అనే మూవీలో నటిస్తోంది. కన్నడలో ఘన విజయం సాధించిన ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో రీమేక్ చేస్తున్నారు. ఇదో సస్పెన్స్ థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కుతోన్న చిత్రం. ఈ సినిమాలో కూడా సమంతది డిగ్నిఫైడ్ అండ్ యాక్టింగ్ స్కోపున్న క్యారెక్టరే. ఇలా పెళ్లి తర్వాత హీరోయిన్‌గా తాను ఎంచుకునే పాత్రల్లో వేరియేషన్‌తో పాటు, ఇంపార్టెన్స్ కూడా వెతుక్కుంటోంది సమంత. ఇప్పటికే స్టార్ హీరోయిన్. ఇక ఈ తరహా క్యారెక్టర్స్‌ని ఎంచుకోవడంతో సమంత స్టార్‌డమ్ మరింత పెరుగుతోంది.
గ్లామరస్‌గా కనిపించడంతో పాటు, తనలోని యాక్టింగ్ టాలెంట్‌ని బయటికి తీసే పాత్రలు ఎంచుకోవడంతో సమంతపై ఇంతవరకూ ఉన్న అభిమానం మరింత రెట్టింపైంది. లీడ్ రోల్ కీర్తి సురేష్‌దే కానీ, సినిమాకి అత్యంత కీలకమైన పాత్రల్లో సమంత, విజయ్ దేవరకొండ కనిపిస్తారట.