ఎన్టీఆర్‌ ఛాన్స్‌ మిస్‌ చేసుకున్నాడేమో.!

By iQlikMovies - May 02, 2018 - 12:15 PM IST

మరిన్ని వార్తలు

అలనాటి మేటి నటి సావిత్రి జీవిత ఆధారంగా 'మహానటి' టైటిల్‌తో సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. లేటెస్ట్‌గా ఈ సినిమా ఆడియో ఫంక్షన్‌ జరిగింది. ఈ ఫంక్షన్‌కి యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ ముఖ్య అతిధిగా విచ్చేశారు. ఈ సినిమాలో ఎంతో మంది యంగ్‌స్టర్స్‌తో పాటు, సీనియర్‌ నటీనటులు కూడా నటించారు. నాగచైతన్య, సమంత, విజయ్‌ దేవరకొండ వంటి ఈ తరం నటీ నటులతో పాటు, రాజేంద్రప్రసాద్‌, దివ్యవాణి, భానుప్రియ వంటి సీనియర్‌ స్టార్స్‌ కూడా నటించారు. 

సావిత్రి జీవితం అంటే అందులో ఎన్టీఆర్‌ పాత్ర కూడా ఉంటుంది. ఆ పాత్ర కోసమే యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ని సంప్రదించారట చిత్ర నిర్మాత. కానీ ఆ పాత్ర చేయడానికి ఎన్టీఆర్‌ ఒప్పుకోలేదట. కానీ ఇలాంటి అవకాశాలు చాలా అరుదుగా వస్తుంటాయి. వచ్చినప్పుడే యూజ్‌ చేసుకోవాలి. అలాంటిది ఆయన పాత్రను పోషించే అర్హత, స్థాయి తనకు లేవని చెప్పాడట ఎన్టీఆర్‌. తాత పాత్రలో కనిపించడం ఇష్టం లేదన్న ఎన్టీఆర్‌ చెప్పిన రీజన్‌ సరైంది కాదనిపిస్తోంది ఈ సినిమాకి. 

ఆల్రెడీ నాగ చైతన్య తాత ఏఎన్నార్‌ పాత్ర పోషిస్తున్నాడు. అలాగే ఎన్టీఆర్‌ కూడా పోషించి ఉంటే బాగుండేది అని ఆడియన్స్‌, అభిమానులు భావిస్తున్నారు. ఆ యాంగిల్‌ నుండి చూస్తే ఎన్టీఆర్‌ ఈ అరుదైన ఛాన్స్‌ని మిస్‌ చేసుకున్నాడనే అనిపిస్తోంది. మే 9న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. కీర్తి సురేష్‌ టైటిల్‌ రోల్‌ పోషిస్తోన్న ఈ సినిమాని నాగ్‌ అశ్విన్‌ తెరకెక్కిస్తున్నారు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS