సమంత హోస్ట్ గా అవతారం ఎత్తింది. `శ్యామ్ జామ్`తో. ఆహా కోసం సెలబ్రెటీలతో ఇంటర్వ్యూలు చేస్తోంది. సమంత హోస్టింగ్, పైగా.. అల్లు అరవింద్ భారీ నిర్మాణ విలువలు, కావల్సినంత పబ్లిసిటీ... ఇవన్నీ ఈ షోపై క్రేజ్ తీసుకొచ్చాయి. తొలి షో... విజయ్ దేవరకొండతో. అది ఒకే అనిపించుకుంది. రానాతో చేసిన టాక్ షో కూడా యావరేజ్ వరకూ వెళ్లింది. అయితే రాను రాను సమంత ఈ టాక్ షోతో బోర్ కొట్టిస్తోందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. సమంత లేటెస్ట్ ఎపిసోడ్.. సైనా నెహ్వాల్‌తో. అయితే ఈ టాక్‌షో... అంతగా మెప్పించలేకపోతోంది. రొటీన్ ప్రశ్నలు, రొటీన్ ఫార్మెట్ లోనే ఈ షో సాగుతోందని, పెద్దగా మెరుపులు లేవని పెదవి విరుస్తున్నారంతా.
ఈ షో కోసం ఆహా మంచి బడ్జెట్ కేటాయించింది. సమంతకు భారీ పారితోషికం ఇచ్చింది. నందినిరెడ్డి వాళ్లు ఈ షో కోసం పని చేస్తున్నారు. కాఫీ విత్ కరణ్ టీమ్ ని ఈ షో కోసం తీసుకొచ్చారు. అయినా సరే, అంత జోష్ రాకపోవడం ఆశ్చర్యపరుస్తోంది. ఇప్పటి వరకూ చేసిన ఇంటర్వ్యూలకూ వ్యూవర్ షిప్ అంతంతమాత్రమే అని సమాచారం. సమంత తెలుగు అంత స్వచ్ఛంగా ఉండదు. దాన్ని అర్థం చేసుకోవాల్సిందే. అయితే.. వచ్చిన తెలుగు సైతం అప్పుడప్పుడూ మాట్లాడడం లేదు. మాటామంతి చాలా వరకూ ఇంగ్లీషులోనే జరుగుతోంది. అది కూడా ఓ మైనస్సే. త్వరలో చిరంజీవి, అల్లు అర్జున్ లాంటి స్టార్లు ఈ షోకి రాబోతున్నారు. వాళ్ల ఎనర్జీ, పాజిటీవ్ నెస్ ఈ షోకి ప్లస్ అవ్వాలి. లేకపోతే... ఆహా తన అమ్ముల పొది నుంచి వదిలిన అస్త్రం మిస్ ఫైర్ అయ్యిందనే అనుకోవాల్సివుంటుంది.