ప్రభాస్ సినిమా అంటే.. అది పాన్ ఇండియా సినిమానే. భాషతో సంబంధం లేకుండా ఆ సినిమాలో నటీనటులు మెరుస్తుంటారు. తమిళ, కన్నడ, మలయాళ, హిందీ చిత్రసీమల నుంచి స్టార్స్ ని తీసుకొచ్చి నిలబెడుతుంటారు. `సలార్`లోనూ స్టార్ల హంగామా కనిపించబోతోందని టాక్.
ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. దీనికి `సలార్` అనే పేరు పెట్టారు. అంటే రాజుకి కుడి భుజం అని అర్థమట. నమ్మిన బంటు పాత్రలో ప్రభాస్ కనిపించనున్నాడు. అంటే.. ఓ రాజు లాంటి పాత్ర తప్పకుండా ఉంటుందన్న మాట. ఆ పాత్ర చాలా కీలకం కానుంది. అందుకే ఆ పాత్రలో ఓ స్టార్ కనిపించే ఛాన్సుందని తెలుస్తోంది. బాలీవుడ్ లోని ప్రముఖ హీరోని ఈ పాత్ర కోసం ఎంచుకోవాలని చూస్తున్నార్ట. ప్రశాంత్ నీల్ కి మోహన్ లాల్ అంటే చాలా ఇష్టం. అందుకే ఈ సినిమాలో ఆయన్ని తీసుకురావాలని భావిస్తున్నాడట. ముందు బాలీవుడ్ లో ఓ స్టార్ హీరోని సంప్రదించి, కాల్షీట్లు సర్దుబాటు కాని పక్షంలో.. మోహన్ లాల్ ని తీసుకురావాలన్నది ప్లాన్. మరి ఏం జరుగుతుందో చూడాలి.