'జాను' టీజర్‌ టాక్‌: శామ్‌ - శర్వా హార్ట్‌ టచ్చింగ్‌ లవ్‌ స్టోరీ.!

మరిన్ని వార్తలు

తమిళ బ్లాక్‌ బస్టర్‌ '96'కి తెలుగు రీమేక్‌గా తెరకెక్కుతోన్న చిత్రం 'జాను'. ఇటీవలే ఈ సినిమాకి టైటిల్‌ ఫిక్స్‌ చేశారు. 'జాను' అనే క్యాచీ అండ్‌ లవ్‌లీ టైటిల్‌ ఫిక్స్‌ చేసి, సగం మార్కులు కొట్టేశారు. ఇక వెరీ లేటెస్ట్‌గా టీజర్‌ వదిలారు. 'చాలా దూరం వెళ్లిపోయావా రామ్‌..' అని సమంత భావోద్వేగంగా అడుగుతుంటే, 'ఎక్కడ వదిలిపెట్టానో అక్కడే ఉన్నాను..' అంటూ రామ్‌ పాత్రలో ఉన్న శర్వానంద్‌ సమాధానమిస్తుండడంతో టీజర్‌ స్టార్ట్‌ అయ్యింది. ఓ స్కూల్‌, స్కూల్‌లో ఓ అమ్మాయి, అబ్బాయి మధ్య చిగురించిన లవ్‌స్టోరీ.. పెద్దయ్యాకా ఆ ఇద్దరు ప్రేమికుల హావభావాలు.. టీజర్‌లో చక్కగా చూపించారు.

రీమేక్‌ మూవీనే కాబట్టి, కాన్సెప్ట్‌పై ఓ ఐడియా ఎలాగూ ఉంది. అయితే, ఆ పాత్రలకు శర్వానంద్‌, సమంతల నటన ప్రాణం పోయనుంది. టీజర్‌ని బట్టి చూస్తే, శర్వానంద్‌ గతంలో నటించిన 'మళ్లీ మళ్లీ ఇది రాని రోజు' తరహాలో క్యూట్‌ అండ్‌ భారమైన లవ్‌స్టోరీగా అనిపిస్తోంది. అలాగే 'పడి పడి లేచె మనసు..' సినిమా తాలూకు పాత్ర బరువులు కూడా కనిపిస్తున్నాయి. ఎంతటి బరువైన పాత్రలనైనా క్యారీ చేయగల టాలెంట్‌ శర్వానంద్‌లో ఉంది. 'యూ టర్న్‌', 'ఓ బేబీ' చిత్రాలతో పాత్రల భారీతనం, బరువుతనం శామ్‌కీ కొట్టిన పిండి అయిపోయాయి. సో ఈ ఇద్దరి కాంబినేషన్‌లో 'జాను' ఎలా ప్రాణం పోసుకోనుందో ఇదిగో ఇలా టీజర్‌ ద్వారా శాంపిల్‌కి చూపించేశారు. ఇక సినిమాలో ఏ రేంజ్‌ పర్‌ఫామెన్స్‌ ఇవ్వనున్నారో చూడాలంటే మరి కొంత సమయం వేచి చూడాలి. తమిళంలో విజయ్‌ సేతుపతి, త్రిష ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాకి ప్రేమ్‌ కుమార్‌ దర్శకత్వం వహించారు. ఒరిజినల్‌ డైరెక్టరే తెలుగు రీమేక్‌నీ హ్యాండిల్‌ చేయడం విశేషం. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌లో దిల్‌రాజు ఈ సినిమాని నిర్మిస్తున్నారు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS