వెటరన్ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మరోసారి మెగాఫోన్ పట్టబోతున్నారు. ప్రఖ్యాత నృత్య కారిణి, సంగీత ఆరాధకురాలు బెంగళూరు నాగరత్నతమ్మ కథని ఆయన వెండి తెరపై ఆవిష్కరించబోతున్నారు. మాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. కథ సిద్ధమైంది. బుర్రా సాయిమాధవ్ ఫైనల్ వెర్షన్‌ని రెడీ చేశారు. బెంగళూరు నాగరత్నమ్మ పాత్ర కోసం సమంతని సంప్రదించే పనిలో ఉంది చిత్రబృందం.
సమంత ఓకే అంటే.. లాక్‌డౌన్ ఎత్తేసిన వెంటనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. సింగీతం ఈ చిత్రాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఆయన కెరీర్‌లో ఎన్నో అద్భుతమైన సినిమాలున్నాయి. బెంగళూరు నాగరత్నమ్మ బయోపిక్ తోనే ఆయన తన సినీ ప్రస్థానం ముగించాలనుకుంటున్నారు. అందుకే ఈ చిత్రం ఓ మైలు రాయిగా మిగిలిపోవాలన్నది ఆయన ఆలోచన. హిందీ తప్ప మిగిలిన భాషల్లో ఈ చిత్రాన్ని తీసుకెళ్లే ఆలోచన వుంది.