మరో ఛాలెంజింగ్‌ పాత్రలో రామలక్ష్మి

By iQlikMovies - May 16, 2018 - 17:54 PM IST

మరిన్ని వార్తలు

స్టార్‌ హీరోయిన్‌గా ఇటు టాలీవుడ్‌నీ, బిజీయెస్ట్‌ హీరోయిన్‌గా అటు కోలీవుడ్‌నీ ఏకకాలంలో దున్నేస్తోన్న ముద్దుగుమ్మ సమంత. 'రంగస్థలం'లో రామలక్ష్మిగా డీ గ్లామర్‌ పాత్రలో కనిపించి కుర్రకారు మనసుల్ని గునపాలతో గుచ్చేసింది. 'మహానటి'లో మధురవాణిలా అవే హృదయాల్ని సన్న సన్నగా కోసేసింది. త్వరలోనే 'అభిమన్యు' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. విశాల్‌ హీరోగా నటిస్తున్నాడు ఈ చిత్రంలో. ఇకపోతే, తమిళంలోనే మరో చిత్రంలో సమంత నటిస్తోంది.

విజయ్‌ సేతుపతి ఈ సినిమాలో హీరో కాగా, హీరోయిన్‌గా సమంత ప్రాధాన్యత ఉన్న రోల్‌ పోషిస్తోంది. పెళ్లి తర్వాత కూడా ఓ హీరోయిన్‌ ఇంత బిజీగా సినిమాలు చేస్తోందంటే అది సమంతకే చెల్లిందేమో. అందులోనూ అన్నీ ప్రాధాన్యత ఉన్న పాత్రలు కావడం. ఆమె నటించిన సినిమాలన్నీ విజయవంతం కావడం మరో చెప్పుకోదగ్గ అంశం. కనీ వినీ ఎరుగని రీతిలో 'రంగస్థలం' విజయం సాధించింది. అంచనాలనే అందుకోనంతగా 'మహానటి'ని సక్సెస్‌ వరించింది.

ఇకపోతే ఇవి కాక మరో డిఫరెంట్‌ కాన్సెప్ట్‌ మూవీ అయిన 'యూ టర్న్‌'లోనూ సమంత నటిస్తోంది. ఈ సినిమాలో సమంతది కీలక పాత్రే కావడం విశేషం. జర్నలిస్టుగా నటిస్తోంది ఈ సినిమాలో సమంత. జర్నీ నేపథ్యంలో సాగే చిత్రమిది. ఈ సినిమా కోసం డిఫరెంట్‌ హెయిర్‌ స్టైల్‌తో సమంత కనిపించనుంది. ఇకపోతే లేటెస్టుగా సమంత సైన్‌ చేసిన విజయ్‌ సేతుపతి మూవీలో ఆమె స్టన్నింగ్‌ రోల్‌ పోషించనుంది.

కరాటే గాళ్‌గా ఈ సినిమాలో సమంత కనిపించనుందని తెలుస్తోంది. ఈ పాత్ర కోసం కరాటేలో ప్రత్యేకంగా శిక్షణ తీసుకుంటోందట. ఇలా సినిమా సినిమాకూ ఛాలెంజింగ్‌ పాత్రలను ఎంచుకుంటూ కెరీర్‌ని మరింత ఉన్నతంగా డెవలప్‌ చేసుకుంటోంది మన అక్కినేని వారి కోడలు సమంత.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS