'బిగ్ బాస్-2' లేటెస్ట్ అప్ డేట్స్

మరిన్ని వార్తలు

బుల్లితెర రియాలిటీ షో 'బిగ్ బాస్' గత ఏడాది తెలుగు ప్రేక్షకులకు స్టార్ మా ఛానల్ ద్వారా పరిచయం చేసారు. తెలుగు లో ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా వ్యవహరించిన ఈ షో తెలుగు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఇప్పుడు అదే ఉత్సాహంతో బిగ్ బాస్ 2 ను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు.

దీనికి వ్యాఖ్యాతగా నేచురల్ స్టార్ నాని వ్యవహరించబోతున్నాడు. దీనికి గాను నాని 4 కోట్ల రూపాయల పారితోషకం తీసుకుంటున్నట్టు సమాచారం. ఎన్టీఆర్ హోస్ట్ చేసిన బిగ్ బాస్ ఫస్ట్ సీజన్ 70 రోజుల్లో ముగిస్తే ఇప్పుడు నాని హోస్ట్ చేస్తున్న బిగ్ బాస్ 2 మరో ముప్ఫై రోజులు పొడిగించారు. అంటే ఈసారి బిగ్ బాస్ సీజన్ 2 100 రోజులు ప్రసారం కానుంది. అంతే కాకుండా కొన్ని కొత్త ఛాలెంజెస్ కూడా బిగ్ బాస్ 2 లో ఉండబోతున్నాయి.

హైదరాబాద్ లోని ప్రముఖ స్టూడియో లో జూన్ రెండవ వారం నుండి బిగ్ బాస్ సీజన్ 2 షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ సీజన్ 2 లో పాల్గొనబోయే పార్టిసిపెంట్స్ జాబితాను నిర్వాహకులు ఇంకా ప్రకటించలేదు. ఈ సారి సెలబ్రిటీలే కాకుండా సామాన్య ప్రజలు కూడా ఈ షో లో పాల్గొనే అవకాశం కల్పించారు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS