ఓ స్టార్ హీరోయిన్గా సమంత సినిమాల్లో తెచ్చుకున్న పాపులారిటీ సంగతి పక్కన పెడితే, సామాజికంగా సమంత చేపట్టే కార్యక్రమాలు అందరితో ప్రశంసలు దక్కించుకునేలా ఉంటాయి. వెండితెరపై ఆమె ఓ స్టార్ హీరోయిన్. ఓ స్టార్ కుటుంబానికి కోడలు. అయితేనేం.. చేనేతకు బ్రాండ్ అంబాసిడర్ అయినా, ఇప్పుడు బుల్లితెరపై అయినా..ఆమె కమిట్మెంట్కి జోహార్లు అని తీరాల్సిందే. తాజాగా బుల్లితెరపై సమంత చేస్తున్న సందడి అందర్నీ షాక్‌కి గురి చేస్తోంది. ఎట్ ది సేమ్ టైమ్ భలే ముచ్చటేసుకొస్తోంది. ఈ మధ్య బుల్లితెరపై ఓ ఛానెల్‌ని సమంత ప్రమోట్ చేస్తోన్న సంగతి తెలిసిందే.
ప్రమోషన్ అంటే ఏదో ఒక యాడ్‌లో నటించి అదే యాడ్‌ని పదే పదే వేసుకోవడం అన్నట్లుగా కాదండోయ్. ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నావన్నది కాదు. ఎంత కమిట్మెంట్తో పని చేశామన్నది ముఖ్యం అని సమంతని చూసి నేర్చుకోవాలనిపిస్తుంది.. ఎవ్వరికైనా ఈ యాడ్స్‌లో సమంతని చూస్తుంటే. ఇంతవరకూ ఇలా ఏ టీవీ ఛానెల్ ఓ స్టార్‌ని వాడుకున్నది లేదు. అలాగే స్టార్స్ కూడా ఇంత బాధ్యతగా తమకి అప్పగించిన పనిని కమిట్మెంట్తో చేసింది లేదు. అందుకే ఈ విషయంలో సమంతని మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నాం. జీవితంలో సమస్యలు చాలా వస్తూ ఉంటాయి. వాటిని ఎదుర్కోవాలంటే ముందుగా ఒక్క అడుగు ముందుకు వెయ్యాలి..
అనే కాన్సెప్ట్‌తో 'ఆరంభం ఒక్క అడుగుతోనే..' అంటూ సమంత చేస్తున్న యాడ్స్, బుల్లితెర ప్రేక్షకులకు పండగలా ఉంటున్నాయి. బుల్లితెర నటీనటుల్ని అందర్నీ ప్రేమగా, ఆప్యాయంగా వారి వారి సీరియల్ పేర్లతో పిలుస్తూ, అచ్చమైన తెలుగింటి అమ్మాయిలా సమంత కనిపిస్తుంటే, చూసే బుల్లితెర ప్రేక్షకులకు చాలా ఆహ్లాదంగా అనిపిస్తోంది. చిన్న పిల్లల్ని కూడా బాగా ఎట్రాక్ట్ చేస్తున్నాయి సమంత యాడ్స్. మరో పక్క సినిమాలతోనూ ఫుల్ బిజీగా గడుపుతోంది సమంత. తెలుగులో 'రంగస్థలం', 'మహానటి' చిత్రాల్లో నటిస్తోంది. తమిళంలో రెండు చిత్రాల్లో నటిస్తోంది క్యూట్ క్యూట్ సమంత.