అక్కినేని వారి ఇంటి కోడలుగా మారిన సమంతాకి సినిమా పరిశ్రమతో పాటు రాజకీయ వర్గాల్లో కూడా బాగానే పాపులారిటీ వచ్చింది. దీనికి ఉదహరణే తెలంగాణ ప్రభుత్వం తరపున చేనేత వస్త్రాలకి బ్రాండ్ అంబాసిడర్ గా ఎంపిక చేయబడింది.
నిన్న సమంతా అలాగే తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు కేటిఆర్ ఒక సమావేశంలో కలిసారు. ఆ సమయంలో కేటిఆర్ సమంతాని చేనేత వస్త్రాలకి బ్రాండ్ అంబాసిడర్ గా పని చేయమని కోరారు. దానికి వెంటనే సమంతా కూడా తన అంగీకారం తెలిపింది. ప్రభుత్వ విన్నపాన్ని స్వీకరించినందుకు మంత్రి సమంతాకి ఒక చేనేత చీరను బహుకరించారట.
ఇదిలాఉంటే మొన్నిమధ్యనే చేనేత కార్మికుల బాధలు విన్నాక తనకై తను చేనేత వస్త్రాలకు బ్రాండ్ అంబాసిడర్ గా ఉంటానని ప్రకటించి సంచలనం సృష్టించాడు. ఇలాంటి తరుణంలో తెలంగాణ ప్రభుత్వం పవన్ కి కౌంటర్ గా సమంతాని ఎంపిక చేయటం వ్యూహాత్మక నిర్ణయం అని జనాలు చెవులు కోరుకుంటున్నారు.
ఏదైతేనేమి చివరికి చేనేత కార్మికులకు మంచి రోజులు వచ్చినట్టు అనిపిస్తుంది కదా!!