సమంత అంత సాహసం చేస్తుందా.?

మరిన్ని వార్తలు

పెళ్లి తర్వాత హీరోయిన్స్‌ కెరీర్‌ క్లోజ్‌ అయిపోతుందనే అపోహలు ఇప్పుడు తొలిగిపోయాయి. పెళ్లి తర్వాత కూడా ముద్దుగుమ్మలు కెరీర్‌లో దూకుడు చూపిస్తున్నారు. అక్కినేని కోడలు సమంతనే అందుకు బెస్ట్‌ ఎగ్జాంపుల్‌గా చెప్పుకోవచ్చు. 

పెళ్లి సమంతకు ఎటువంటి అడ్డంకి కాలేదు సరికదా. బిజీగా సినిమాలు చేస్తూ, చేసే ప్రతి సినిమాతోనూ సక్సెస్‌ అందుకుంటూ జోరు ప్రదర్శిస్తోంది. ఈ ఏడాది 'రంగస్థలం'తో బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ కొట్టిన సమంత ఇటీవల 'యూటర్న్‌'తోనూ మంచి పేరు తెచ్చుకుంది. తర్వాత భర్త నాగచైతన్యతో ఓ సినిమాలో నటించబోతోంది. శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాకి 'మజిలీ' అనే పేరు పరిశీలిస్తున్నారు.

 

ఇదిలా ఉంటే, మరో కొత్త ప్రాజెక్ట్‌ సమంత ఖాతాలో పడినట్లుగా లేటెస్ట్‌ సమాచారమ్‌. లేడీ డైరెక్టర్‌ నందినీ రెడ్డి దర్శకత్వంలో సమంత ఓ సినిమాకి సైన్‌ చేసిందట. ఆ సినిమాలో సమంత ఓ ఛాలెంజింగ్‌ రోల్‌ పోషించబోతోందనే గాసిప్‌ ఫిల్మ్‌ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. ఆ ఛాలెంజింగ్‌ రోల్‌ ఏంటంటే, సమంత 60 ఏళ్ల బామ్మ పాత్రలో కనిపించబోతోందట. హీరోయిన్‌గా లీడ్‌ రోల్‌ పోషిస్తూనే, ఫ్లాష్‌బ్యాక్‌లో బామ్మ పాత్రలో సమంత కనిపించబోతోందనీ విశ్వసనీయ వర్గాల సమాచారమ్‌. 

అయితే ఈ గాసిస్‌లో నిజమెంతుందో తెలీదు కానీ, త్వరలోనే సినిమా సెట్స్‌పైకి వెళ్లనుందనీ తెలుస్తోంది. పెళ్లి తర్వాత సమంత ఎంచుకుంటున్న పాత్రలన్నీ ఓ రకంగా ఛాలెంజింగ్‌ రోల్స్‌ అనే చెప్పాలి. ఇంకా ఇంకా ఇలాంటి ఛాలెంజింగ్‌ రోల్స్‌ చాలానే తన నుండి ఎక్స్‌పెక్ట్‌ చేయొచ్చు అని సమంత చెప్పిన మాటలు గుర్తు చేసుకుంటే, ఏమో ఈ సాహసం సమంత చేసినా చేసేయొచ్చు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS