తెలుగు రియాలిటీ షో.. బిగ్ బాస్‌కి నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. శని, ఆదివారాల్లో నాగ్ ఎంట్రీనే స్పెషల్ ఎట్రాక్షన్. అయితే.. ఆయన ప్రస్తుతం మనాలీలో ఉన్నారు. `వైల్డ్ డాగ్` షూటింగ్ జరుపుకుంటున్నారు. నాగ్ లేకపోవడంతో ఈ షోని ఎవరు నడిపిస్తారన్న ప్రశ్న తలెత్తింది. రమ్యకృష్ణ, లేదా రోజాలలో ఎవరో ఒకరు ఈ కార్యక్రమాన్ని నడిపిస్తారనుకున్నారు. మరోవైపు మనాలీ నుంచీ నాగ్ స్పెషల్ ఫ్లైట్ లో వస్తారని, షోకి ఆటంకం రాకుండా చూసుకుంటారని చెప్పుకున్నారు.
అయితే.. నాగ్ మనాలీ నుంచి రావడం కుదర్లేదని టాక్. అందుకే ఈ వారం ఈ షోని అక్కినేని కోడలు సమంత నిర్వహించబోతున్నట్టు టాక్. అంటే మామ స్థానంలో కోడలు వస్తోందన్నమాట. మరి సమంత ఈ షోని ఎంత వరకూ రక్తి కట్టిస్తుందో చూడాలి. సమంత ఎంట్రీ ఈ వారానికే పరిమితం అవుతుందా? లేదంటే వచ్చే వారమూ కొనసాగుతుందా? అనేది తేలాలంటే మాత్రం ఒకట్రెండు రోజులు ఓపిక పట్టాల్సిందే.