కూరగాయలు అమ్మిన సమంత

By iQlikMovies - September 02, 2018 - 14:32 PM IST

మరిన్ని వార్తలు

సమంత అంటే ఒక మంచి నటిగానే కాకుండా సమాజం కోసం పనిచేసే ఒక సామాజిక కార్యకర్తగా కూడా గుర్తింపు సంపాదించుకుంది.

ఆమె నడుపుతున్న ప్రత్యూష ఫౌండేషన్ ద్వారా ఎంతోమంది సహాయం చేస్తున్నది. తాజాగా ఆమె చెన్నైలోని ఒక కూరగాయల అంగడిలో కూరగాయలు అమ్ముతూ కనపడింది. అయితే ఇలా ఎందుకు చేస్తున్నది అని ఆరా తీయగా- ఆంధ్రప్రదేశ్ లోని ఒక కుటుంబానికి ఆర్ధికంగా సహాయం చేసేందుకు ఒక షో ద్వారా ఆమె డబ్బుని సేకరించేందుకు ఇలా చేస్తున్నదట.

ఈ షో త్వరలోనే టీవీలో టెలికాస్ట్ అవ్వనుందట. ఇప్పటికే ఈ షో ద్వారా పలువురు నటీనటులు తమకి తోచిన విధంగా సహాయం చేయడం జరిగింది.

ఇదిలావుండగా సమంత నటించిన చిత్రం U-Turn సెప్టెంబర్ 13న ప్రేక్షకుల ముందుకి రానుంది.    

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS