ఈరోజు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు కావడంతో అభిమానులు, సినీ పరిశ్రమ నుండి ఆయనకి శుభాకాంక్షల వెల్లువెత్తుతున్నాయి.
ఇక మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన బాబాయ్ కోసం ఒక స్పెషల్ గిఫ్ట్ ఇచ్చాడు. అయితే ఆ గిఫ్ట్ కొద్దిగా రిస్క్ తో కూడినది అవ్వడంతో ఇప్పుడు అది టాక్ అఫ్ ది టౌన్ గా మారింది. ఇంతకి ఆ రిస్క్ గిఫ్ట్ ఏంటంటే- ప్యారాగ్లైడింగ్ చేస్తూ పవన్ కళ్యాణ్ కి శుభాకాంక్షలు తెలియచేశాడు. ఈ మొత్తాన్ని ఆయన భార్య ఉపాసన రికార్డు చేసి ట్విట్టర్ ద్వారా పోస్ట్ చేసింది.
ఇది చూసిన అభిమానులంతా తన బాబాయ్ కి సాహసాలు చేయడం అంటే ఇష్టం అని ఆయన పుట్టినరోజుకి ఇలాంటి ఒక సాహసం చేసి గిఫ్ట్ ఇవ్వడం చాలా గ్రేట్ అంటూ పొగిడేస్తున్నారు.
ఇదిలావుండగా ఈరోజు ట్విట్టర్ ఫేస్బుక్ వంటి సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ కేంద్రంగా పోస్టులు, వీడియోలు హల్చల్ చేస్తున్నాయి.