'యూటర్న్‌' ఛాలెంజ్‌ ప్రమోషన్స్‌ అదిరిపోతున్నాయ్‌.!

By iQlikMovies - September 07, 2018 - 14:41 PM IST

మరిన్ని వార్తలు

ఈ మధ్య సోషల్‌ మీడియాని దడదడలాడిస్తున్నాయ్‌ రకరకాల పేర్లతో వస్తున్న ఛాలెంజ్‌లు. 'కికి' ఛాలెంజ్‌ అనీ, హమ్‌ ఫిట్‌ తో ఇండియా ఫిట్‌' అనీ ఇలా ఈ మధ్య సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు వీళ్లూ వాళ్లూ అనే తేడా లేకుండా సందడి చేసిన ఛాలెంజ్‌ల గురించి ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేదు. 

ఇదే ఫార్మేట్‌లో తాజాగా సమంత ఓ ఛాలెంజ్‌ చేసింది. ఇది తన సినిమా 'యూ టర్న్‌' ప్రమోషన్స్‌ కోసమే అని ఒప్పుకుని తీరాల్సిందే. లేటెస్టుగా యూటర్న్‌ ప్రమోషన్స్‌లో భాగంగా ఓ వీడియో సాంగ్‌ రిలీజ్‌ చేసింది చిత్ర యూనిట్‌. కర్మ థీమ్‌ ఆధారంగా రూపొందిన ఈ సాంగ్‌లో సమంత వేసిన స్టెప్పులు అందర్నీ ఆశ్చర్యపరిచాయి. యంగ్‌ కొరియోగ్రాఫర్‌ యశ్వంత్‌ ఈ వీడియో సాంగ్‌ని కంపోజ్‌ చేశాడు. సమంత కూడా ఎంతో కష్టపడి ఈ సాంగ్‌లో డాన్సులు ఇరగదీసింది. యంగ్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌ అనిరుధ్‌ ఈ సాంగ్‌కి మ్యూజిక్‌ కంపోజ్‌ చేశాడు. డిఫరెంట్‌ ఫార్మేట్‌లో ఉన్న ఈ వీడియో సాంగ్‌ అందర్నీ విశేషంగా ఎట్రాక్ట్‌ చేసింది. 

ఇకపోతే తాజాగా ఈ ఎట్రాక్షన్‌ని సమంత తన సినిమా ప్రమోషన్స్‌ కోసం బాగా వాడేసుకుంది. ఈ సాంగ్‌లోని కొన్ని స్టెప్పుల్ని సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసి, ఇలా ఎవరైనా చేయగలరా? అంటూ ఛాలెంజ్‌ విసిరింది. అలా ఈ స్టెప్పులేసి ఆ వీడియోలను పోస్ట్‌ చేయమని చెప్పింది. సమంత చెబితే ఊరుకుంటారా? అమ్మాయిలు, అబ్బాయిలు, పిల్లలు, పెద్దోళ్లు అనే తేడా లేకుండా సమంత ఛాలెంజ్‌ని స్వీకరించి, ఆ డాన్స్‌ వీడియోలు పోస్ట్‌ చేస్తున్నారు. 

తాజాగా సమంత మరిది, అక్కినేని హీరో అయిన అఖిల్‌ కూడా వదినగారి ఛాలెంజింగ్‌ స్టెప్పులు తను కూడా ట్రై చేసి పోస్ట్‌ చేశాడు. అలా సమంత తన సినిమాని డిఫరెంట్‌గా ప్రమోట్‌ చేసేస్తోంది. ఈ నెల 13న 'యూ టర్న్‌' ప్రేక్షకుల ముందుకు రానుంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS