ఈ ఏడాది మరో విజయం సమంత ఖాతాలో పడింది. అదే 'యూ టర్న్'. సినిమా సంగతెలా వున్నా, సినిమాలో సమంత పాత్రకి మాత్రం భలే మార్కులు పడిపోయాయి. 'యూ టర్న్' సినిమాలో సమంత యాక్టింగ్ అదరహో.. అంటూ ప్రశంసలతో సోషల్ మీడియాలో పోటెత్తేస్తోంది. ఇంతలా సోషల్ మీడియాలో తన మీద అభిమానం 'వర్షమై' కురిసేస్తోంటే, సమంత ఆనందం ఏ స్థాయిలో వుంటుందో ఊహించుకోవడం కష్టమే.
కన్నడ 'యూటర్న్' సినిమాని తమిళంతోపాటు, తెలుగులోకి డబ్ చేశారు. తెలుగులోనూ, తమిళంలోనూ ఈ సినిమాకి మంచి రెస్పాన్స్ వస్తోంది. కన్నడ 'యూటర్న్' చూసినవారికి 'ఓ మోస్తరు' అన్పిస్తున్నా, రివ్యూలు ఫర్వాలేదన్పించేలా వచ్చినా.. సమంతకి మాత్రం అందరూ యునానిమస్‌గా ఓటేసేశారు.
'రంగస్థలం' నుంచి వరుసగా సమంత ఖాతాలో హిట్ సినిమాలే పడ్తున్నాయి. ఓ నటికి ఇంతకన్నా కావాల్సింది ఏముంది.? పెళ్ళయ్యాక సినిమాల్లో ఛాన్సులు తగ్గిపోతాయనే మాట సమంత విషయంలో అబద్ధమని తేలిపోయింది. పెళ్ళయ్యాక సమంత కెరీర్‌లో నిజానికి జోరు పెరిగింది. సక్సెస్ రేటు కూడా అంతే. ఇప్పుడు మరిన్ని విభిన్నమైన పాత్రల్ని ఎంచుకోవడానికీ సమంతకి అవకాశం దొరికింది. వచ్చిన అవకాశాన్ని వచ్చినట్టే సద్వినియోగం చేసుకుంటున్న సమంతకి హేట్సాఫ్ చెప్పి తీరాల్సిందే.