బిగ్ బాస్ రియాల్టీ ఓ సీజన్ టూ అనేక వివాదాల నడుమ కొనసాగుతోంది. వివాదాలన్నీ ఎలిమినేషన్ ప్రాసెస్ గురించే కావడం గమనించాల్సిన విషయం. ఎలాగైనా కౌశల్‌ని ఎలిమినేట్ చేయాలన్న ఆలోచనత గత కొన్ని వారాలుగా ప్రతి ఎలిమినేషన్‌లోనూ కౌశల్‌ని వుంచేస్తున్నారు.
హౌస్‌మేట్స్ అంతా కౌశల్‌నే కార్నర్ చేసేసి 'గ్రూపులు' కట్టేసినా, హోస్ట్ నాని హౌస్‌లోని పరిస్థితుల్ని కంట్రోల్ చేయలేకపోతున్నాడు. హౌస్‌మేట్స్‌కి కూడా తమ తప్పు అర్థం కావడంలేదు. ఎన్నిసార్లు ఎలిమినేషన్ ప్రక్రియలో నిలబడినా, కౌశల్ సేఫ్ అవుతూనే వచ్చాడు. ఈసారి కౌశల్ ఇమేజ్‌ని తగ్గించేందుకు నిర్వాహకులు కుట్ర పన్నారంటూ సోషల్ మీడియాలో పెద్దయెత్తున ప్రచారం జరుగుతోంది. అదెంతవరకు నిజమవుతుందోగానీ కౌశల్ లేని బిగ్‌బాస్‌ని ఊహించుకోవడం చాలా కష్టం.
బిగ్ బాస్ మెగాస్టారగా కౌశల్ తన ఇమేజ్‌ని ఈ 90 రోజుల్లో సంపాదించేసుకున్నాడని నిస్సందేహంగా చెప్పొచ్చు. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, దేశంలోని పలు రాష్ట్రాల్లో, విదేశాల్లో కూడా కౌశల్‌కి మద్దతుగా అభిమానులు హల్‌చల్ చేయడం చూస్తున్నాం. ఇదిలా ఉంటే ఈ వీకెండ్‌లో ఇద్దరు ఎలిమినేషన్ అయ్యే అవకాశం వుంది. ఎవరు సేఫ్ అవుతారు? ఎవరు ఎలిమినేట్ అవుతారు? అనే చర్చలో ఎక్కువగా కౌశల్ పేరు 'ఎలిమినేషన్' కేటగిరీలో విన్పిస్తోంది.
కానీ, కౌశల్ ఆర్మీ మాత్రం కౌశల్ వెనకాల తాము అండగా వున్నామంటోంది. చూడాలిక, ఏం జరుగుతుందో.