సమంత ప్రధాన పాత్ర పోషిస్తోన్న చిత్రం 'యూ టర్న్'. కన్నడలో ఘన విజయం సాధించిన ఈ చిత్రాన్ని తెలుగులో అదే టైటిల్‌తో రీమేక్ చేశారు. మాతృకను రూపొందించిన పవన్ కుమార్ ఈ చిత్రాన్ని తెలుగులోనూ తెరకెక్కిస్తున్నాడు. తాజాగా ఈ చిత్రం ట్రైలర్ విడుదలైంది. జర్నలిస్టు పాత్రలో సమంత పాత్ర ఆకట్టుకునేలా ఉంది. గతంలో సమంత ఇలాంటి పాత్రలో ఎప్పుడూ కనిపించలేదు. 'నేను ఇలా ఈ బార్ కౌంటర్‌లో ఈ రకంగా కూర్చుంటానని అనుకోలేదు..' అంటూ సమంత చెప్పే డైలాగ్‌తో ట్రైలర్ స్టార్ట్ అయ్యింది.
సమంత ఎక్స్‌ప్రెషన్స్ చాలా కొత్తగా ఉన్నాయి. ముక్కుపుడక, డిఫరెంట్ హెయిర్ స్టైల్, డిఫరెంట్ బాడీ లాంగ్వేజ్.. అంతా చాలా చాలా కొత్తగా కనిపిస్తోంది. ఇదో థ్రిల్లర్ మూవీ. జర్నీ నేపథ్యంలో జరిగే క్రైమ్ స్టోరీ. ఆ క్రైమ్ స్టోరీని ఛేదించే జర్నలిస్టుగా సమంత కనిపిస్తోంది. తనకు తెలియకుండానే ఈ క్రైమ్‌తో సంబంధం ఉన్న వ్యక్తిగా సమంతను ట్రైలర్‌లో చూపించారు. ఈ కేసు ఇన్వెస్టిగేషన్ చేసే పవర్‌ఫుల్ పోలీసాఫీసర్ పాత్రలో ఆది పినిశెట్టి నటిస్తున్నాడు. మరో యంగ్ హీరో కమ్ 'చిలసౌ' డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్‌తో పాటు, సీనియర్ నటి భూమిక ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు.
ట్రైలర్‌లో వీరందరికీ చోటు దక్కింది. ట్రైలర్‌కి మంచి రెస్పాన్స్ వస్తుంది. సమంతకు పర్‌ఫామెన్స్‌తో పాటు, గ్లామర్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ట్రైలర్‌లో రెండు చోట్ల సమంతను గ్లామర్‌గా చూపించారు. వీపుపై స్కార్‌పియన్ టాటూతో సమంత కనిపిస్తోంది. 'రంగస్థలం', 'మహానటి', 'అభిమన్యుడు' చిత్రాలతో ఇటీవల సూపర్ హిట్స్ అందుకున్న సమంతకు 'యూ టర్న్' చిత్రం కూడా మంచి సక్సెస్ తెచ్చిపెట్టేలానే అనిపిస్తోంది ట్రైలర్ చూస్తుంటే.