సమంత డాన్సింగ్‌ స్టైల్‌ అదిరిపోయింది.!

By iQlikMovies - September 03, 2018 - 12:17 PM IST

మరిన్ని వార్తలు

అక్కినేని సమంత ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం 'యూ టర్న్‌'. కన్నడలో ఘన విజయం సాధించిన ఈ సినిమాను ఒరిజినల్‌ను తెరకెక్కించిన దర్శకుడు పవన్‌ కుమార్‌ తెలుగులో రీమేక్‌ చేశారు. సెప్టెంబర్‌ 13న చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. 

ఈ సందర్భంగా సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఓ ఆడియో సింగిల్‌ రిలీజ్‌ చేశారు. యంగ్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌ అనిరుధ్‌ ఈ సాంగ్‌ని కంపోజ్‌ చేశారు. ఈ సాంగ్‌ వీడియోలో సమంత వేసిన స్టెప్పులు అదిరిపోతున్నాయి. గతంలో అనుష్క హీరోయిన్‌గా వచ్చిన 'భాగమతి' సినిమా ప్రమోషన్స్‌ కోసం ఓ స్పెషల్‌ వీడియో సాంగ్‌ని డిజైన్‌ చేశారు. ఆ సాంగ్‌లో డాన్సర్స్‌ బీభత్సంగా డాన్సులేస్తుంటే, అనుష్క అప్పియరెన్స్‌తో అదరగొట్టేసింది. 

అలాగే ఇప్పుడు సమంత 'యూటర్న్‌' ప్రమోషన్‌ సాంగ్‌ కోసం తానే స్వయంగా స్టెప్పులు ఇరగదీసింది. చాలా స్టైలిష్‌గా కనిపిస్తోంది ఈ వీడియో సాంగ్‌లో సమంత. ఈ వీడియోలో సమంత పర్‌ఫామెన్స్‌కి ఫ్యాన్స్‌ ఫిదా అయిపోతున్నారు. సమంతతో పాటు ఈ వీడియో సాంగ్‌లో అక్కడక్కడా అనిరుధ్‌ కూడా హమ్‌ చేస్తూ కనిపించాడు. అలాగే ఈ సినిమాలో ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఆది పినిశెట్టి, భూమిక తదితరులు కూడా ఈ వీడియోలో కనిపించారు. 

జర్నీ నేపథ్యంలో సాగే సస్పెన్స్‌ థ్రిల్లర్‌ మూవీగా ఈ సినిమా రూపొందుతోంది. సమంత డిఫరెంట్‌ హెయిర్‌ స్టైల్‌తో సరికొత్త లుక్‌లో కనిపిస్తోంది.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS