హీరోయిన్లకు పీఆర్ ఎంత ముఖ్యమో, మేనేజర్, టీమ్ కూడా అంతే ముఖ్యం. ఈ విషయంలో అగ్ర కథానాయికలంతా జాగ్రత్తగానే ఉంటారు. వాళ్లకంటూ సొంత టీమ్ ఉంటుంది. టీమ్ సభ్యుల్ని జాగ్రత్తగా చూసుకోవడంలో సమంత తరవాతే ఎవరైనా అని చెబుతుంటారు. తన పర్సనల్ మేకప్ మెన్, హెయిర్ డ్రస్సర్, డ్రైవర్.. ఇలా చాలామందిని ఏళ్ల తరబడి కొనసాగిస్తూ వస్తోంది. సమంతతో పాటు వాళ్లూ ఎదిగారు. వాళ్ల జీవితాల్ని సమంత సెటిల్ చేసేసింది కూడా. తొలి సినిమా నుంచీ సమంత మేనేజర్ మహేంద్రనే. ఇప్పుడు ఆయనని రీప్లేస్ చేసింది సమంత. మహేంద్ర స్థానంలో ముంబైకి చెందిన ఓ మేనేజర్‌ని నియమించుకుంది. అంతే కాదు.. తన టీమ్ లో చాలామంది సభ్యుల్ని మార్చేసింది.
సమంత లైఫ్ లో ఇటీవల కొన్ని కీలక పరిణామలు చోటు చేసుకుంటూ వచ్చాయి. విడాకులు కూడా అందులో భాగమే. ఇప్పుడు సమంత కొత్త లైఫ్‌ని మొదలెట్టింది. అందుకే టీమ్ లో కూడా మార్పులు వచ్చాయని తెలుస్తోంది. దానికి తోడు బాలీవుడ్ నుంచి సమంతకు అవకాశాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో బాలీవుడ్ కి దగ్గరగా ఉండాలన్న ఉద్దేశంతో.. ముంబై నుంచి కొంతమందిని తన టీమ్ లో చేర్చుకుంది. అందులో భాగంగానే మార్పులూ, చేర్పులూ చోటు చేసుకున్నాయి.