సాధారణంగా హీరోయిన్లకు పెళ్లయితే.. సంసారమే జీవితంగా గడుపుతారు. సినిమాలకు స్వస్తి చెబుతారు. అయితే.. ఈమధ్య హీరోయిన్లు తెలివి మీరారు. పెళ్లి పెళ్లే - సినిమా సినిమానే అనుకుంటున్నారు. సమంత పెళ్లయినా నటిస్తోంది.కాజల్ దీ అదే దారి. అయితే.. సమంత ఇప్పుడు సినిమాలకు టాటా చెప్పాలని నిర్ణయం తీసుకుందట. అయితే అది తాత్కాలికంగానే. సమంత చేతిలో ఒకే ఒక్క సినిమా ఉంది. అదే.. గుణ శేఖర్ దర్శకత్వంలో రూపొందుతున్న `శాకుంతలమ్`.
ఈ సినిమా తరవాత.. సమంత మరో కొత్త సినిమాపై సంతకం చేయలేదు. దానికి కారణం... సమంత కొన్నాళ్లు బ్రేక్ తీసుకోవాలనుకుంటోందట. ఈ గ్యాప్లో.. సమంత తల్లికావాలనే ప్రయత్నాలు మొదలెడుతుందని టాక్. ఈమధ్య సమంత ఎప్పుడు ఎదురైనా `మీరు తల్లి ఎప్పుడు అవుతారు` అనే ప్రశ్నే ఎదురువుతోంది. సమంత - చైలు.. ఇప్పుడు తమ వ్యక్తిగత జీవితం గురించి సీరియస్ గా ఆలోచిస్తున్నారని, అందుకే సమంత ఈ నిర్ణయం తీసుకుందని గుసగుసలు వినిపిస్తున్నాయి.