ఉప్పెన సినిమా ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్. ఓ తొలి సినిమా హీరోకి ఈ స్థాయిలో వసూళ్లు రావడం నిజంగా చిత్రసీమని విస్మయ పరుస్తోంది. రూపాయికి రూపాయి లాభం తీసుకొచ్చిన సినిమాల జాబితాలోనూ ఉప్పెన చేరిపోతుంది. ఈ సినిమాకి ప్రధాన ఆకర్షణ.. హీరో, హీరోయిన్లే. వైష్ణవ్ తేజ్, కృతి శెట్టి ఈ సినిమాతో తెలుగు తెరకు పరిచయమయ్యారు.
వీళ్ల పారితోషికాలు చాలా చీప్ అని హీరోకి 50 లక్షలు, హీరోయిన్ కి కేవలం ఆరు లక్షలే పారితోషికం ఇచ్చారని ప్రచారం జరిగింది. అందుకనేనేమో... ఇప్పుడు మైత్రీ బృందం రంగంలోకి దిగింది. హీరో, హీరోయిన్లని చీప్ గా కొట్టేశారన్న అపవాదు తమపై రాకుండా... వాళ్లిద్దరికీ సర్ప్రైజ్ క్యాష్ గిఫ్టులు ఇచ్చి ఆనందంలో ముంచెత్తింది. ఈ సందర్భంగా వైష్ణవ్ తేజ్‌కి 50 లక్షలు, కృతికి 10 లక్షలు ఇచ్చారని సమాచారం అందుతోంది. అంటే.. ఈసినిమాతో వైష్ణవ్‌కి కోటి రూపాయల పారితోషికం వచ్చిందన్నమాట. కృతికి ముట్టింది పదహారు లక్షలే. పదహారణాల పడుచు ప్రాయానికి 16 లక్షలేం సరిపోతాయి..?