యూటర్న్, ఓ బేబీ లాంటి సినిమాలతో లేడీ ఓరియెంటెడ్ సినిమాల బాట పట్టింది సమంత. ఇక మీదటా అలాంటి కథలనే ఎంచుకోబోతోందట. ప్రస్తుతం అశ్విన్ శరవణన్ దర్శకత్వంలో నటించడానికి ఒప్పుకొంది. సోనీ పిక్చర్స్ సంస్థ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తోంది. ఇందులో సమంత ఓ ప్రయోగం చేయబోతోందట. ఇందులో మూగమ్మాయిగా నటించబోతోందని సమాచారం. సినిమా మొత్తమ్మీద సమంత ఒక్క మాట కూడా మాట్లాడదట.
సమంత క్యారెక్టరైజేషన్ ఈ సినిమాకి ప్రధానమైన బలమని తెలుస్తోంది. ఇప్పటికే శరవణన్ కథ మొత్తం నేరేట్ చేసేశాడు. సమంత కూడా ఈ స్క్రిప్టు ఓకే చేసేసింది. లాక్ డౌన్ సమయంలో ఇంట్లోనే గడిపింది సమంత. ఓ బేబీ తరవాత మరో సినిమా ఏదీ సెట్ పైకి వెళ్లలేదు. ఈ సినిమాతోనే సమంత తన పని మొదలెట్టబోతోందని టాక్. దీంతో పాటు.. సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వం వహించే ఓ చిత్రంలోనూ సమంతే కథానాయికగా నటించబోతోందని సమాచారం. ఆ సినిమాకి సంబంధించిన అధికారిక ప్రకటన రాబోతోంది.