వెకేషన్‌ మోడ్‌ సమంత గ్లామరస్‌ 'టర్న్‌'

మరిన్ని వార్తలు

'యూటర్న్‌' సినిమాతో ఇటీవల మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న సమంత సడెన్‌గా ఓ షాకిచ్చింది. చూస్తున్నారుగా ఇదిగో ఇలా గ్లామర్‌ తెరలను తెరిచి అభిమానులను కాస్సేపు షాక్‌లో పడేసింది. ఆ షాక్‌ నుండి తేరుకున్న ఫ్యాన్స్‌ గతంలో సమంత ఏంటి ? అని ఒక్కసారి గుర్తుకు తెచ్చుకుని తమని తామే సముదాయించుకున్నారు. ఇకపోతే ఇటీవల ప్రాధాన్యత ఉన్న పాత్రలతో తనదైన శైలిలో నటించి, హిట్‌ మీద హిట్‌ కొడుతూ, అక్కినేని వారి కోడలిగా తనదైన హుందాతనాన్ని ప్రదర్శిస్తోంది సమంత. భర్త చైతూతో హాలీడే వెకేషన్‌ నిమిత్తం విదేశాల్లో ఎంజాయ్‌ చేస్తోంది. ఆ ఎంజాయ్‌మెంట్‌లో భాగంగానే ఇదిగో ఇలా కెమెరాకి పోజిచ్చింది. ఈ ఫోటో తీసింది బహుశా చైతూనే కావచ్చు. ఇప్పుడీ ఫోటో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. ఇంచుమించు బికినీని తలపిస్తోన్న ఈ కాస్ట్యూమ్‌లో సమంత అరవిరిసిన అందాలు కెవ్వుకేక పుట్టిస్తున్నాయిలే.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS