అక్కినేని కోడలు సమంత మరియు పూజా హెగ్డే.. ఇద్దరు ప్రస్తుతం టాలీవుడ్ టాప్ హీరోయిన్స్ లిస్ట్ లో ఉన్నారు. 'ఓ బేబీ' లాంటి ఫిమేల్ ఓరియెంటెడ్ సినిమా హిట్ సాధించడం తో 'లేడీ సూపర్ స్టార్' అని పిలవడం కూడా మొదలెట్టేసారు సమంత ఫ్యాన్స్. అలా అని పూజా హెగ్డే ఏం తక్కువ తినలేదు. వరుస విజయాలతో టాలీవుడ్ మరియు బాలీవుడ్ ప్రేక్షకులను అలరించి, తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకుంది. తాజాగా వీరిద్దరి మధ్య చిచ్చు రేగింది.. దాంతో ఈ ఇద్దరి ఫ్యాన్స్ ఈ గొడవని తారాస్థాయికి తీసుకెళ్లారు. గతంలో ఎప్పుడూ వీరి మధ్య విబేధాలు లేవు. కానీ తాజాగా 'పూజా హెగ్డే' ఇన్ స్టాగ్రామ్ ద్వారా పెట్టిన ఒక పోస్టు ఈ గొడవకి అసలు కారణం.
అయితే అందులో తన తప్పేం లేదు.. తన ఇన్ స్టా అకౌంట్ హ్యాక్ అయింది.. ఆ పోస్ట్ కి తనకు ఎటువంటి సంబంధం లేదని చెప్పుకొచ్చింది పూజా. దాంతో సమంత ఫ్యాన్స్ హర్ట్ అయ్యి.. పూజా, సమంతకు క్షమాపణ చెప్పాలి అంటూ ట్విట్టర్లో ట్రెండ్ చేశారు. పూజా ఫ్యాన్స్ కూడా తన తప్పేం లేదంటూ పూజాను సపోర్ట్ చేశారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇదే హాట్ టాపిక్.. దీని పై అప్పుడే ఫన్నీ మీమ్స్ కూడా వచ్చేసాయి. మరి ఈ గొడవ ఆగాలంటే ఇద్దరిలో ఎవరో ఒకరు అధికారిక ప్రకటన చేయాలి. ఈ పని ఎవరు ముందు చేస్తారో చూడాలి.