లాక్ డౌన్ కారణంగా టాలీవుడ్ ఇంకా తెరుచుకోలేదు. కానీ ఓ వివాదం తెరపైకి వచ్చింది. నందమూరి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు వివాదానికి కారణం. ''సినిమా పరిశ్రమ పెద్దలు తెలంగాణ ప్రభుత్వంతో జరిపిన చర్చలకు నన్ను పిలవలేదు. వాళ్ళంత మంత్రి తలసానితో కలిసి కూర్చుని భూములు పంచుకుంటున్నారా? అని బాలయ్య అనడంతో దుమారం రేగింది. అయితే దీనిపై నిర్మాత సి.కల్యాణ్ మాట్లాడుతూ.. బాలకృష్ణను సమావేశాలకు ఆహ్వానించాల్సిన బాధ్యత ‘మా’పై ఉందని అనడం వెరైటీగా అనిపించింది. ఇప్పుడు దీనిపై ‘మా’ అధ్యక్షుడు నరేష్ ట్విటర్ ద్వారా స్పందించారు. ‘
సమావేశాలకు బాలకృష్ణను ఆహ్వానించే బాధ్యత ‘మా’ది అని సి. కల్యాణ్ చెప్పడం నన్ను షాక్‌కు గురి చేసింది. ‘మా’ అధ్యక్షుడు, జనరల్ సెక్రటరీని కూడా మీటింగ్‌కు పిలవలేదు. అలాంటిది.. నన్ను పిలవని సమావేశాలకి నేను ఇంకొకర్ని ఎలా పిలుస్తా’ అని ట్వీట్ చేశారు నరేష్. నిజమే .. నరేష్ మాటల్లో లాజిక్ వుంది. మీటింగ్ ఎవరో కండక్ట్ చేస్తే దానికి 'మా' ఎలా భాద్యత వహిస్తుందో.. అర్ధం కానీ లాజిక్కే.