'రంగస్థలం'లో రామలక్ష్మిగా పల్లెటూరి అమ్మాయి పాత్రలో కనిపించిన సమంత, ఇప్పుడు జిమ్‌లో తెగ కష్టపడిపోతోంది. పుల్ అప్స్ చేస్తూ ఆ వీడియోని తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. తొలి సారిగా పుల్అప్స్ ట్రై చేశా. మొదటి సారి ఘోరంగా ఫెయిల్ అయ్యా. దాంతో 30డేస్‌లో సాధించాలని టార్గెట్ పెట్టుకున్నా. నేను సాధించగలనా? లేదా అంటూ ఆ వీడియోపై సమంత అభిమానుల్ని ప్రశ్నిస్తూ ఎస్ ఆర్ నో అనే ఆప్షన్స్ పెట్టింది.
సమంతకు వర్కవుట్లు చేయడం కొత్తేమీ కాదు. ఎప్పటికప్పుడు వర్కవుట్స్ చేస్తూ, తన ఫిజిక్‌ని ఫిట్‌గా ఉంచుకుంటుంది. దానికి సంబంధించిన వీడియోలు ఎప్పటికప్పుడే ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తుంటుంది. తన భర్త నాగచైతన్యతో కలిసి సమంత జిమ్‌లో చేసిన వీడియోలు కూడా పోస్ట్ చేస్తుంటుంది. అయితే ఈ తాజా వీడియో మాత్రం కొంచెం స్పెషల్‌గా ఉంది. తొలిసారి పుల్అప్స్ ట్రై చేస్తోందట కదా. తను పెట్టుకున్న టార్గెట్‌ని శామ్ రీచ్ అవ్వాలని మనం కూడా కోరుకుందాం.
ఇకపోతే శామ్ చేతిలో ఇప్పుడు చాలా ప్రాజెక్టులున్నాయి. 'రంగస్థలం'తో రికార్డు హిట్ కొట్టేసిన సమంత, నెక్ట్స్ 'మహానటి' ద్వారా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో సమంత మధురవాణి అనే జర్నలిస్టు పాత్ర పోషిస్తోంది. ఇది కాక తమిళంలో విశాల్‌తో నటించిన 'అభిమన్యు' కూడా విడుదలకు సిద్దంగానే ఉంది.
మరో పక్క కన్నడ చిత్రం తెలుగు రీమేక్ 'యూ టర్న్'లోనూ సమంత నటిస్తోంది. థ్రిల్లర్ కాన్సెప్ట్‌తో వస్తున్న ఈ సినిమాలో డిఫరెంట్ హెయిర్ స్టైల్‌తో సమంత కనిపించనుంది.