సమంత కథానాయికగా నటించిన `యశోద` ఆగస్టు 12న వస్తోంది. సరే.. సినిమా అన్నాక ఏదో ఓ రిలీజ్ డేట్ ఉంటుంది కాబట్టి... సమంత సినిమాకీ అది వచ్చింది అనుకోవొచ్చు. కాకపోతే.. ఇక్కడ మేటర్ అది కాదు... దానికంటే ఒక్క రోజు ముందు నాగచైతన్య సినిమా రిలీజ్ కానుంది. చైతూ నటించిన తొలి హిందీ చిత్రం `లాల్ సింగ్ చద్దా` ఆగస్టు 12న వస్తోంది. ఈ సినిమా రిలీజ్ డేట్ ఎప్పుడో ఫిక్స్ అయ్యింది. ఆ తరవాతే.. యశోద రిలీజ్ డేట్ ప్రకటించారు. అంటే... సమంత కావాలనే ఈ డేట్ ని రావాలని ఫిక్సయ్యిందన్నమాట. ఇక్కడ మరో విశేషం ఏమిటంటే. ఆగస్లు 12న.. అఖిల్ నటించిన `ఏజెంట్` రాబోతోంది. అంటే.. అటు చైతూ, ఇటు అఖిల్... మధ్యలో సమంత అన్నమాట. ఇది నిజంగా అక్కినేని వారే!
చైతూ సినిమా 11న వచ్చి, అఖిల్ సినిమా 12న వస్తే.. పెద్ద మేటరేం ఉండేది కాదు. అన్నదమ్ముల వార్ అని సరిపెట్టుకునేవారు. అయితే ఇప్పుడు మధ్యలో సమంత వచ్చి చేరింది. `లాల్ సింగ్ చద్దా` పాన్ ఇండియా సినిమా. అలాంటి సినిమాలొస్తున్నప్పడు ప్రాంతీయ చిత్రాలు కాస్త సైడ్ అవుతాయి. పైగా ఇది అమీర్ ఖాన్ సినిమా కూడా. కానీ సమంత వెనుకడుగు వేయలేదు. కావాలనే 12న రావాలని డిసైడ్ అయ్యింది. అందుకే ధైర్యంగా రిలీజ్ డేట్ ప్రకటించింది. అంటే... మాజీ భర్తపై పోటీకి కావాలనే దిగిందన్నమాట. దాంతో పాటు.. మాజీ మరిది గారి సినిమా కూడా ఉంది. ఈ మూడు సినిమాల్లో గెలుపెవరిది అనేది ప్రేక్షకులే చెప్పాలి.