ప్రెగ్నెంట్‌గా ఉన్నప్పుడే అందరి దృష్టినీ ఆకర్షించిన సమీరారెడ్డి, బిడ్డకు జన్మనిచ్చాక కూడా తన ప్రత్యేకతను చాటుకుంటోంది. ప్రస్తుతం ప్రపంచ తల్లి పాల వారోత్సవాలు జరుగుతున్న నేపథ్యంలో ఆమె తల్లి పాల ఆవశ్యకతను వివరిస్తూ, భర్త, కుటుంబ సభ్యులు ఆ సమయంలో మహిళలకు ఎలాంటి భద్రత కలిగించాలి. ఏవిధంగా అండగా నిలవాలి అని సూచిస్తూ, సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ అందర్నీ ఆలోచింపచేస్తోంది.
కొందరు తల్లులు తమ పిల్లలకు పాలివ్వలేకపోవడం అనేది ఓ మానసిక సమస్య.. అయితే, కొంతమంది కొన్ని కారణాల వల్ల, తమ పిల్లలకు పాలివ్వలేకపోవచ్చు. అయితే, అన్నీ బావుండి, పాలు ఇవ్వలేకపోవడమనే మానసిక సమస్యకు కారణం మాత్రం తీవ్రమైన ఒత్తిడే. ప్రెగ్నెంట్‌గా ఉన్నప్పుడు, ప్రసవం తర్వాత మహిళలు ఓ రకమైన ఒత్తిడికి, భయానికి గురవుతుంటారు. ఆ ఒత్తిడిని దూరం చేయగల శక్తి, భర్తకు మాత్రమే ఉంటుంది. భర్తతో పాటు, కుటుంబ సభ్యులు కూడా ఆమెకు కావల్సిన ధైర్యాన్ని, సపోర్ట్‌ని అందించాలి. మీ ప్రేమే వారిలో ఆ భయాల్ని, ఒత్తిడిని దూరం చేసి, మానసిక ప్రశాంతతను ఇస్తుంది.
అంతేకాదు, పాలు పడడం లేదని తల్లులు ఆందోళన చెందకూడదు.. అని సమీరా సూచిస్తోంది. పాలు పట్టే తీరును బట్టి కూడా పాల ఉత్పత్తి ఆధారపడి ఉంటుందని సమీరా ఈ పోస్ట్ ద్వారా తెలియజేసింది. తన క్యూట్ బేబీతో దిగిన ఫోటోతో ఈ పోస్ట్ షేర్ చేసింది. సిట్యువేషనల్‌గా సమీరా రెడ్డి పెట్టిన పోస్ట్ ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అయ్యింది.