పునర్నవి డేటింగ్‌ ఎవరితోనో తెలుసా.!

మరిన్ని వార్తలు

పునర్నవి రిలేషన్‌షిప్‌లో ఉందా.? అంటే ఆ సమాధానం మాత్రం అడగొద్దండీ బాబూ. ఎందుకంటే, అన్నీ చెప్పింది కానీ, ఆ ఒక్కటీ చెప్పలేదు పునర్నవి. బిగ్‌బాస్‌ తాజా ఎపిసోడ్‌లో భాగంగా, పునర్నవి, రాహుల్‌ మధ్య ఆసక్తికరమైన డిస్కషన్‌ జరిగింది. ఆ డిస్కషన్‌లో భాగంగా రాహుల్‌, పునర్నవిని నాతో డేటింగ్‌కి వస్తావా.? అని అడిగాడు. ఆ క్రమంలోనే తాను వేరెవరితోనో రిలేషన్‌ షిప్‌లో ఉన్నట్లుగా పునర్నవి చెప్పింది.

కానీ, పూర్తి డీటెయిల్స్‌ మాత్రం వెల్లడించలేదు. చివరిగా, అందరూ చూస్తున్నారు రాహుల్‌, ఇష్యూ చేయొద్దు.. అంటూ రాహుల్‌ని వారించి, టాపిక్‌ డైవర్ట్‌ చేసేసింది. దాంతో సోషల్‌ మీడియాలో పునర్నవి డేటింగ్‌ విషయమై రచ్చ జరుగుతోంది. అమ్మో పునర్నవి ఏమంత తక్కువ కాదే.. అంటూ విమర్శలు వస్తున్నాయి. అయినా, డేటింగ్‌ అనేది ఈ రోజుల్లో చాలా కామన్‌ ఇష్యూ అని కొందరు కొట్టి పాడేస్తున్నారు. మొత్తానికి పునర్నవి బిగ్‌హౌస్‌లో సమ్‌థింగ్‌ డిఫరెంట్‌ ఆటిట్యూడ్‌తో తన డిగ్నిటీ ప్రదర్శిస్తోంది.

 

హౌస్‌లో ఎవ్వరితోనూ ఊరికే గొడవలు కోరి తెచ్చుకోవడం లేదు. అందరితోనూ లిమిటెడ్‌ రిలేషన్‌ షిప్‌ మెయింటైన్‌ చేస్తోంది. ఆమె డ్రస్సింగ్‌, ఆటిట్యూడ్‌.. ఇలా అన్నీ అందర్నీ ఆకట్టుకుంటున్నాయి. ఈ వారం ఎలిమినేషన్స్‌ లిస్టులో పునర్నవి పేరు కూడా ఉంది. కెప్టెన్సీ పుణ్యమా అని వరుణ్‌ గట్టెక్కేశాడు. కానీ, జాఫర్‌, హిమజ, శ్రీముఖి, వితిక, పునర్నవి, మహేష్‌ విట్టా, రాహుల్‌.. వీరిలో ఈ వారం హౌస్‌ నుండి బయటికి వచ్చేదెవరో చూడాలిక.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS