అండర్ వాటర్‌లో అందాల భామలు బికినీలతో ఫీట్స్ చేస్తుంటే.. అబ్బా చూసేందుకు ఆ ముచ్చట ఎంత అందంగుంటది. కానీ, ప్రెగ్నెంట్ లేడీస్ చేస్తే.. అదీ 9 నెలల నిండు గర్భిణి అండర్ వాటర్‌లో ఫీట్స్ చేస్తే చూసేందుకు కాస్త కష్టంగా, భయంగా అనిపించదూ. కానీ, ఆ సాహసం చేసేసింది అందాల భామ సమీరా రెడ్డి. ఈ మధ్య ఈ భామ బేబీ బంప్‌తో చేస్తున్న పబ్లిసిటీ అంతా ఇంతా కాదు.
నెటిజన్స్‌కి దిమ్మ తిరిగే షాకులిస్తోంది. తాజాగా అలాంటి షాకే మరోసారి ఇచ్చింది సమీరారెడ్డి. అప్పుడెప్పుడో కాస్త బొద్దుగా కనిపించిందని ఓ నెటిజన్ ఆమెని కామెంట్ చేయడంతో, కష్టపడి సన్నబడిందట. సన్నబడడం బాగానే ఉంది. కానీ, ప్రస్తుతం గర్భిణిగా ఆమె చేస్తున్న ఫీట్లు చూస్తేనే విస్తు కలుగుతోంది. తాజాగా అండర్ వాటర్‌లో సమీరారెడ్డి చేయించుకున్న ఫోటో సెషన్‌కి వావ్ అనాలా? లేక భయపడాలా? అర్ధం కావడం లేదు. ఓ సారి ఈ పిక్స్‌పై లుక్కేసుకోండి.
మొత్తం బాడీని నీటిపై తేల్చుతూ, ముని వేళ్లపై బ్యాలెన్స్ చేసి, చేతుల్ని కూడా వెనక్కి వదిలేసింది. బేబీ బంప్ అదీ 9 నెలల బేబీ బంప్ ఎంత క్లియర్‌గా కనిపిస్తుందో చూశారుగా. సహజంగా ఈ టైంలో గర్భిణులు తమ బేబీ బంప్‌పై ఈగ కూడా వాలకుండా చూసుకుంటారు. బేబీ బంప్‌ని సున్నితంగా సుతారంగా చేతితో నిమురుకుంటూ జాగ్రత్తగా కాపాడుతుంటారు. కానీ, ఈ అందాల భామ మాత్రం ఎలా నీటికొదిలేసిందో చూశారుగా. అందుకే ఈ ఫోటోలపై సమీరా రెడ్డి సోషల్ మీడియాలో మిశ్రమ రెస్పాన్స్ అందుకుంటోంది.