నందమూరి రాముడు 'మంచి' బాలుడు.

మరిన్ని వార్తలు

నందమూరి కళ్యాణ్‌రామ్‌ నటిస్తున్న తాజా చిత్రం టైటిల్‌ అనౌన్స్‌ చేశారు. సతీష్‌ వేగేశ్న దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి క్లాసిక్‌ టైటిల్‌ ఫిక్స్‌ చేశారు. 'ఎంత మంచి వాడవురా' అనే టైటిల్‌ లోగోని అఫీషియల్‌గా అనౌన్స్‌ చేశారు. సహజంగానే సతీష్‌ వేగేశ్న సినిమాలకు క్లాసిక్‌ అండ్‌ క్యాచీ టైటిల్స్‌ని సెలెక్ట్‌ చేసుకుంటాడు. ఆయన దర్శకత్వంలో 'శతమానం భవతి' బ్లాక్‌ బస్టర్‌ హిట్‌గా నిలిచింది.

 

ఇటీవల ఈయన దర్శకత్వంలోనే వచ్చిన 'శ్రీనివాస కళ్యాణం' మాత్రం నిరాశపరిచింది. ఇక ఇప్పుడు కళ్యాణ్‌రామ్‌తో 'ఎంత మంచివాడవురా' టైటిల్‌తో సినిమా రూపొందిస్తున్నాడు. ఇటీవలే ఈ సినిమా లాంఛనంగా ప్రారంభమైంది. అందాల మెహ్రీన్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇదిలా ఉంటే, కళ్యాణ్‌రామ్‌ మరో సినిమా కూడా అనౌన్స్‌ చేశాడు. అదే 'రావణ'.

 

రెండు సినిమాలను ఎట్‌ ఏ టైమ్‌ పూర్తి చేసే యోచనలో ఉన్నాడట. అయితే, టైటిల్స్‌ పరంగా క్వైట్‌ ఆపోజిట్‌ టైటిల్స్‌ని ఎంచుకున్నాడు కళ్యాణ్‌రామ్‌. గతంలో 'ఎమ్మెల్యే - మంచి లక్షణాలున్న అబ్బాయ్‌' అనే టైటిల్‌తో ఓ సినిమాలో నటించాడు. టైటిల్‌లో మంచి ఉంది కానీ, ఆ సినిమా కళ్యాణ్‌రామ్‌కి మంచి హిట్‌ ఇవ్వలేకపోయింది. తాజా టైటిల్‌లో 'మంచి' కళ్యాణ్‌రామ్‌కి కలిసొస్తుందా.? వేచి చూడాలిక.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS