ట్రైలర్ టాక్ : కిరణ్ అబ్బవరం 'సమ్మతమే'

By iQlikMovies - June 16, 2022 - 17:00 PM IST

మరిన్ని వార్తలు

యంగ్ హీరో కిరణ్ అబ్బవరం కొత్త చిత్ర "సమ్మతమే". గోపీనాథ్ రెడ్డి దర్శకత్వం. చాందిని చౌదరి కథానాయిక. జూన్ 24న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను బయటికి వచ్చింది. పెళ్లి, ప్రేమ చుట్టూ తిరిగే కథ ఇది.

 

''నీకు లైఫ్ లో గోల్ ముఖ్యమా ? లైఫ్ లో కి వచ్చే గర్ల్ ముఖ్యమా ? అని హీరోయిన్ అడిగితే .. నా లైఫ్ లో గోలే గర్ల్ రావడం అని హీరో చెప్పడం ఇంట్రస్టింగా వుంది. ఐదు సార్లు సారీ చెప్పని హీరోయిన్ ఆడిగే సీన్ బావుంది. '' నేనే కాదు నీకు ఏ అమ్మాయి కరెక్ట్ కాదు. అద్దంలో నీ మొహం చూసికొని బొట్టుపెట్టుకొని తాళి కట్టుకో' అనే డైలాగ్ కూడా ఆసక్తికరంగా వుంది. మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్ ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా థియేట్రికల్ రైట్స్‌ని సొంతం చేసుకుంది. కిరణ్ అబ్బవరం గత చిత్రాలు విజయవంతం కావడంతో ఈ చిత్రం కూడా ఆసక్తినెలకొంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS