విభిన్న కథా చిత్రాలను ఎంచుకోవడంలో సుధీర్‌బాబు ముందుంటాడు. ఆయన నుండి వస్తున్న తాజా చిత్రం 'సమ్మోహనం'. ఇంద్రగంటి మోహనకృష్ణ ఈ చిత్రానికి దర్శకుడు. ఇంద్రగంటి సినిమాలంటేనే డిఫరెంట్‌గా ఉంటాయి. ఏదో మెస్మరైజ్ చేసి, ప్రేక్షకుల్ని ధియేటర్స్‌కి రప్పిస్తాయి.
తాజాగా విడుదలైన 'సమ్మోహనం' ట్రైలర్ చూస్తే, ఈ సినిమా కూడా అలాగే ఆడియన్స్‌ని ఎట్రాక్ట్ చేయడం ఖాయమనిపిస్తోంది. సినిమా వాళ్లంటే అంత మంచి అభిప్రాయం లేని ఓ కుర్రాడు సినిమా హీరోయిన్ లవ్‌లో పడడం, ఆ తర్వాత సినిమా వారి పట్ల అతని అభిప్రాయాన్ని ఎలా మార్చుకున్నాడనేది ఈ సినిమా కథ. సినిమా కష్టాల్ని తెరపై కళ్లకు కట్టినట్లుగా చూపించారనిపిస్తుంది ఈ సినిమాలో.
అదితీరావ్ హైదరీ రీల్ లైఫ్ హీరోయిన్‌గా నటించింది ఈ సినిమాలో. ట్రైలర్‌లో చెప్పిన కొన్ని డైలాగులు మనసుకు హత్తుకునేలా ఉన్నాయి. 'అసలేముందిరా ఈ స్టార్లలో.. నటన అబద్దం, గ్లామర్ అబద్దం, మాటలు అబద్ధం.. అయినా ఎగబడతారేంట్రా..?' అని సుధీర్‌బాబు డైలాగుతో ట్రైలర్ స్టార్ట్ అవుతుంది. అక్కడక్కడా ఎంటర్‌టైనింగ్ డైలాగ్స్, హీరో, హీరోయిన్ లవ్ ట్రాక్, సెంటిమెంట్ డైలాగ్స్ ఇలా అన్ని కమర్షియల్ అంశాలతో కూల్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌లా ట్రైలర్‌ని కట్ చేశారు. సినిమాలో సినిమా వాళ్లకు సంబంధించిన పలు ఆశక్తికరమైన అంశాలు టచ్ చేసినట్లే ఉంది.
చూడాలి మరి ట్రైలర్ అయితే బాగుంది. సినిమాతో ఇంద్రగంటి - సుధీర్‌బాబు ఏం మ్యాజిక్ చేయనున్నారో చూడాలంటే, జూన్ 14 వరకూ వేచి చూడాల్సిదే మరి. అప్పుడేగా సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేది.