గబ్బిలాలతో సంపూకి ఏంటి పని.?

మరిన్ని వార్తలు

కామెడీలో ‘వెరైటీ అతి’కి పరాకాష్ట సంపూర్నేష్‌బాబు సినిమాలు. సంపూ సినిమా వస్తోందంటే ఆ కిక్కే వేరప్పా. ‘హృదయకాలేయం’ నుంచి ‘కొబ్బరిమట్ట’ వరకూ సంపూ చేసిన సినిమాలన్నీ దేనికదే ప్రత్యేకం. ఎప్పుడు సినిమా స్టార్ట్‌ అవుతుందో, ఎప్పుడు సినిమా పూర్తవుతుందో తెలియదు.. కానీ, అనూహ్యంగా సినిమాలు ది¸యేటర్లలోకి వచ్చేస్తుంటాయి. తాజాగా సంపూర్నేష్‌ నుంచి ఇంకో సినిమా రాబోతోంది. సినిమాకి టైటిల్‌ ‘క్వశ్చన్‌ మార్క్‌’. అవును ఇది నిజ్జంగా నిజం. జులై 30న ఈ సినిమా విడుదల కాబోతోందట. పైగా, చైనాలోని వుహాన్‌లోని గబ్బిలాల మార్కెట్‌లో చిత్రీకరించిన చివరి సినిమా అట.

 

ఈ తరహా ప్రచారాలు సంపూ సినిమాలకే ప్రత్యేకం. సినిమా ఎప్పుడు ప్రారంభమయ్యిందో ఎవరికీ తెలియదు. కానీ, సంపూ పుట్టినరోజు సందర్భంగా ఈ రోజు ఆసక్తికరమైన పోస్టర్స్‌ని విడుదల చేశారు. అందులో కరోనా వైరస్‌కి సంబంధించిన అంశాల్ని పొందుపర్చారు. ఏ మాటకామాటే చెప్పాలంటే, సంపూ లుక్‌ అదిరిపోయిందంతే. నోలన్‌ మౌలి ఈ చిత్రానికి దర్శకుడు. అసలే, లాక్‌డౌన్‌ కారణంగా అన్నీ మూసుకుపోయాయి. మరి, ది¸యేటర్లలో జులై 30న ఈ సినిమా ఎలా రిలీజ్‌ అవుతుందబ్బా.? దటీజ్‌ సంపూ.. తలచుకుంటే ఏదైనా చేసెయ్యగలడు. ఇంతకీ, పోస్టర్స్‌లో గబ్బిలాలతో పండగ చేసుకుంటున్న సంపూకి, వాటితో పనేంటట.? ఇదైతే ప్రస్తుతానికి సస్పెన్స్‌.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS