మలయాళ `అయ్యప్పయుమ్ కోషియమ్` రీమేక్ త్వరలోనే పట్టాలెక్కబోతోంది. ఈసినిమాలో పవన్ కల్యాణ్ - రానా కథానాయకులుగా నటిస్తున్న సంగతి తెలిసిందే. సాయి పల్లవి కథానాయిక. సాగర్ చంద్ర దర్శకత్వం వహిస్తున్నాడు. త్రివిక్రమ్ స్క్రీన్‌ప్లే, సంభాషణలు సమకూరుస్తున్నాడు.
ఈ సినిమాలో సముద్ర ఖని కీలక పాత్ర పోషిస్తున్నాడు. సముద్ర ఖని ని త్రివిక్రమే రికమెండ్ చేసినట్టు తెలుస్తోంది. `అల వైకుంఠపురములో` సముద్రఖని నటించిన సంగతి తెలిసిందే. ఆ ఎఫెక్షన్ తోనే... ఈ సినిమాలోనూ ఆయన్ని లాక్కొచ్చాడట త్రివిక్రమ్. ఇటీవల విడుదలైన `క్రాక్`లో.. సముద్రఖని నటన బాగా నచ్చింది. ఆ సినిమా కూడా హిట్టు. ఆ సెంటిమెంట్ తోనే.. ఆయన్ని ఈ రీమేక్‌లో తీసుకొచ్చాడట త్రివిక్రమ్. తమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు.