పవన్ కల్యాణ్ సినిమా అంటేనే రికార్డుల జాతర. పైగా సుదీర్ఘ విరామం తరవాత.. వెండి తెరపై పవన్ ని చూసుకునే అవకాశం వచ్చింది. ఇక పవన్ అభిమానులు ఆగుతారా? సినిమా బయటకు రాకుండానే రికార్డుల పరంపరకు శ్రీకారం చుట్టారు. ఇటీవల... సంక్రాంతి సందర్భంగా వకీల్ సాబ్ టీజర్ ని విడుదల చేసిన సంగతి తెలిసిందే. పవన్ ఫ్యాన్స్‌కి ఈ టీజర్ విపరీతంగా నచ్చింది. అందుకే యూ ట్యూబ్ లో నెంబర్ వన్ ట్రెండింగ్ గా వకీల్ సాబ్ నిలిచింది.
పవన్ నుంచి టీజర్ వచ్చినప్పుడు యూ ట్యూబ్ లో టాప్ 1గా ఉండడం విచిత్రం కాదు. కానీ గత 72 గంటల నుంచీ ఇదే టాప్ 1లో ఉండడం ఓ సూపర్ సన్సేషనల్. ఇది పవన్ కే సాధ్యం. హిట్లూ, లైకులు, షేర్లూ పరంగానూ.... కొత్త రికార్డులు సృష్టిస్తున్నాడు వకీల్ సాబ్. ఇక సినిమా ఏ రేంజులో ఉంటుందో? బాలీవుడ్ లో ఘన విజయం సాధించిన పింక్ కి ఇది రీమేక్. ఈ వేసవిలో ప్రేక్షకుల ముందుకు వస్తుంది.