'హరి హర వీరమల్లు’ సినిమాని పూర్తి చేయడంపై దృష్టి సారించారు పవన్‌కల్యాణ్. మరోవైపు కొత్త కథలకీ పచ్చజెండా ఊపుతున్నారు. ‘సాహో’ ఫేమ్ సుజీత్ దర్శకత్వంలో సినిమా చేయడానికి పవన్‌కల్యాణ్ అంగీకారం తెలిపారు. ఈ కలయికలో సినిమాని డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. ఆదివారం కాన్సెప్ట్ పోస్టర్‌తో ఈ ప్రాజెక్ట్‌ని అధికారికంగా ప్రకటించింది చిత్రబృందం.
ఇదీలావుంటే సముత్తరఖని దర్శకత్వంలో పీపుల్ మీడియా బ్యానర్ పై వినోదాయశితం రీమేక్ చేయాలి పవన్. ఈ మూవీ ప్రకటన అధికారికంగా వచ్చింది. అయితే ప్రస్తుతానికి ఈ సినిమాని పక్కనే పెట్టిసినట్లు తెలుస్తోంది. ఈ సినిమా స్థానంలో హరీష్ శంకర్ తో మరో సినిమాకి కాల్షీట్లు సర్దుతున్నారు పవన్. వచ్చే ఎన్నికల లోగ సుజిత్, హరీష్ సినిమాలు పూర్తవుతాయి. ఎన్నికల తర్వాత మిగతా లైను సెట్స్ పైకి వెళ్ళే అవకాశం వుంది. ప్రస్తుతానికైతే వినోదాయశితం రీమేక్ లేనట్లేనని సమాచారం.