సమంత ప్రధాన పాత్రలో నందినీ రెడ్డి దర్శకత్వంలో ఓ సినిమా రూపొందనుందన్న సంగతి తెలిసిందే. కొరియన్ చిత్రానికి రీమేక్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో సమంత ఛాలెంజింగ్ రోల్లో కనిపించనుంది. 60 ఏళ్ల బామ్మ గెటప్‌లో సమంత కనిపించనుంది. ఆ తర్వాత ఆ బామ్మ 16 ఏళ్ల అమ్మాయిగా ఎలా మారిందనేదే ఈ సినిమా కాన్సెప్ట్. అయితే ఈ కాన్సెప్ట్‌ని మన నేటివిటీకి తగ్గట్లుగా మార్చి తెరకెక్కించనున్నారు నందినీ రెడ్డి. ఇకపోతే ఈ సినిమాకి టైటిల్ ఇదే అంటూ ఓ ప్రచారం జరుగుతోంది.
రీసెంట్గా సమంత నటించిన 'రంగస్థలం' సినిమాలోని 'ఎంత సక్కగున్నావే..' పాట ఎంత పాపులర్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నేచురల్ బ్యూటీనెస్‌తో సమంత కిర్రాకు పుట్టించింది ఈ పాటలో. అందుకే ఈ పాటలోని 'ఎంత సక్కగున్నావే..' మాటని తీసుకుని టైటిల్‌గా పెట్టాలనుకుంటున్నారట నందినీ రెడ్డి సినిమాకి. ఈ సినిమాలో సమంత బామ్మ నుండి భామగా మారిపోనుంది కాబట్టి, ఈ టైటిల్ యాప్ట్ అని భావిస్తున్నారట. అయితే మెయిన్ టైటిల్ 'ఓ బేబీ' అనీ, 'ఎంత సక్కగున్నావే' క్యాప్షన్‌గా పెట్టాలని చిత్రయూనిట్ భావిస్తోందట.
ఒకవేళ ఇదే జరిగితే 'ఎంత సక్కగున్నావే..' అంటూ మరోసారి సమంత పేరు మార్మోగిపోవడం ఖాయం. పెళ్లి తర్వాత సమంత నుండి వస్తున్న సినిమాలన్నీ సూపర్ హిట్స్ కావడంతో పాటు, కాన్సెప్ట్ పరంగా చాలా కొత్తగా ఉంటున్నాయి. అందులో ఒకటిగా నిలిచిపోవడమే కాదు, కెరీర్‌కి ఈ సినిమా ఎంతగానో ఉపయోగపడనుందని సమంత భావిస్తోందట. త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదికెళ్లనుంది. మరోవైపు సమంత, భర్త చైతూతో కలిసి 'మజిలీ' సినిమాలో నటిస్తోంది. శివ నిర్వాణ ఈ సినిమాకి దర్శత్వం వహిస్తున్నారు.