టిల్లు స్క్వేర్ డైరక్టర్ తో సందీప్ కిషన్

మరిన్ని వార్తలు

టాలీవుడ్ లో స్ట్రగుల్డ్ యాక్టర్స్ లో సందీప్ కిషన్ ఒకరు. అడపాదడపా సినిమాలు చేస్తూనే ఉన్నాడు కానీ విజయాలు వరించట లేదు. కష్ట పడుతున్నా, లక్ కలిసి రాని హీరోల్లో సందీప్ ఒకడు. గత మూడేళ్ళుగా తన సినిమాలు వస్తున్నాయి, పోతున్నాయి. కానీ ఎవరికీ పెద్దగా తెలియటం లేదు. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో సినిమాలు చేసినా  సరైన గుర్తింపు తెచ్చుకోలేక పోయాడు. 2021లో వచ్చిన  A1 ఎక్స్‌ప్రెస్, ఊరు పేరు భైరవకోనతో పరవాలేదు అనిపించుకున్నాడు. సందీప్ కిషన్ ఎందుకు సక్సెస్ కాలేకపోతున్నాడు. కథలు ఎంపికలో తప్పటడుగులు వేస్తున్నాడా అనిపిస్తోంది. ఏదైనా కానీ సందీప్ ఇండస్ట్రీలో ఇంకొంత కాలం నిలబడాలంటే అర్జంటుగా ఒక హిట్ పడాలి. అందుకోసం సందీప్ రక రకాల ప్రయత్నాలు చేస్తున్నాడు. 
           

సందీప్ ప్రజంట్ ధమాకా లాంటి  హిట్ కొట్టిన త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో ఓ సినిమా కమిట్ అయ్యాడు. తన కెరియర్ లో 30 వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్ట్ ని ప్రసన్న కుమార్  నిర్మిస్తున్నారు. ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ లాంటి సూపర్ హిట్ కొట్టిన డైరెక్టర్ స్వరూప్ దర్శకత్వంలో ఓ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు సందీప్. ఈ మూవీకి ‘వైబ్’ అనే టైటిల్ ఫిక్స్ చేసారు. ఇవి కాకుండా సందీప్ ఓ వెబ్ సిరీస్ లో కూడా నటిస్తున్నట్టు సమాచారం.  


వెబ్ సిరీస్ లో నటించటం సందీప్ కి ఇదే మొదటిసారికాదు. ఇది వరకే సూపర్ హిట్ సిరీస్ ఫ్యామిలీ మెన్ లో నటించాడు. ఇప్పుడు మళ్ళీ OTT లోకి రీఎంట్రీ ఇస్తున్నాడు.  ‘టిల్లు స్క్వేర్’ తో ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన దర్శకుడు మల్లిక్ రామ్ తో వెబ్ సిరీస్ చేసేందుకు సన్నాహాలు చేసుకుంటున్నట్టు టాక్. రాజీవ్ చిలుక ప్రొడ్యూసర్ గా తెరకెక్కుతున్న ఈ సిరీస్ ని ప్రముఖ OTT సంస్థ నెట్‌ఫ్లిక్స్ ఆడియన్స్ ముందుకు తీసుకు రానుంది. వీటిలో సందీప్ కి ఏవి హిట్ తెచ్చి పెడతాయో చూడాలి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS