టాలీవుడ్లో ఓ క్రేజీ కాంబినేషన్‌కి రంగం సిద్ధం అవుతుంది. అర్జున్ రెడ్డితో సంచలనం సృష్టించి, అదే కథని బాలీవుడ్‌లోనూ హిట్ చేసిన సందీప్ రెడ్డి వంగా ఇప్పుడు పవన్ కల్యాణ్ కోసం ఓ కథ సిద్ధం చేస్తున్నట్టు సమాచారం. సందీప్ తో సినిమా చేయడానికి స్టార్ హీరోలంతా రెడీ అంటున్న ఈ తరుణంలో... పవన్ కి `నో` చెప్పడానికి పెద్దగా కారణాలు కనిపించకపోవొచ్చు.
పవన్ కల్యాణ్‌తో ఓ సినిమా చేయడానికి మైత్రీ మూవీస్ ఎప్పుడో అడ్వాన్సు ఇచ్చేసింది. ఇప్పుడు వాళ్లు సందీప్‌కీ అడ్వాన్సు ఇచ్చారు. వారిద్దరితో మైత్రీ మూవీస్ ఓ సినిమా చేయాలని భావిస్తోందట. పవన్ ఓకే అంటే... తనతో సినిమా చేయడానికి తనకు ఎలాంటి అభ్యంతరం లేదని సందీప్ కూడా మైత్రీ మూవీస్‌కి మాటిచ్చాడని సమాచారం.
పవన్ ముందైతే దర్శకుల క్యూ చాలా ఉంది. పవన్ ఓకే అంటే సినిమాలు చేయడానికి రెడీ అంటున్నారు. ఇప్పుడు పవన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడా అన్నది ఆసక్తిగా మారింది. ఒకవేళ పవన్ సందీప్‌కి ఛాన్స్ ఇస్తే.. అది తప్పకుండా షేక్ ఆఫ్ ది ఇండ్రస్ట్రీ అవుతుంది.