'ఆయన' ముందు 'ఈయన'కు 'ఆమె'తో నటించడం కష్టమైందట!

మరిన్ని వార్తలు

ఎవరీ ఆయన, ఈయన, ఆమె.. అనుకుంటున్నారా? సూర్య, సాయేషా సైగల్‌, ఆర్య ప్రధాన పాత్రల్లో 'బందోబస్త్‌' అనే సినిమా తెరకెక్కింది తెలుసు కదా! ఈ నెల 20న ఈ సినిమా గ్రాండ్‌ రిలీజ్‌ అవుతోంది. అసలు వివరాల్లోకి వెళితే, సూర్య, ఆయేషా ఈ సినిమాలో హీరో, హీరోయిన్లుగా నటిస్తున్నారు. సాయేషా ఎవరో తెలుసు కదా.. ఆర్యకు రియల్‌ భార్య. ఆయన కూడా ఈ సినిమాలో నటించారు. సో సూర్యకు, ఆర్య ముందు ఆయన భార్యతో రొమాంటిక్‌ సీన్స్‌లో నటించడం చాలా కష్టమైందట.

 

ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా సూర్య ఈ విషయాల్ని ఫ్యాన్స్‌తో పంచుకున్నాడు. ఇకపోతే 'బందోబస్త్‌' సూర్య కెరీర్‌లోనే భారీ బడ్జెట్‌ చిత్రంగా తెరకెక్కుతోంది. లైకా ప్రొడక్షన్స్‌ బ్యానర్‌లో రూపొందిన ఈ చిత్రం పొలిటికల్‌ బ్యాక్‌ డ్రాప్‌లో తెరకెక్కుతోంది. దేశంలోని ప్రముఖులకు భద్రత కల్పించే ఎన్‌ఎస్‌జీ, ఎస్‌పీజీ బ్యాక్‌ డ్రాప్‌నీ చూపించారట. ఈ సినిమా చూశాకా ఆయా శాఖల పట్ల అపారమైన గౌరవం ఏర్పడుతుందని సూర్య చెబుతున్నారు.

 

కమాండో ఆఫీసర్‌గా సూర్య కనిపిస్తున్నారు ఈ సినిమాలో. చాలా విజయవంతమైన చిత్రాల్లో నటించిన సూర్యకు 'బందోబస్త్‌' కొత్త అనుభూతినిచ్చిందట. రియల్‌ ఇన్సిడెంట్స్‌ని బేస్‌ చేసుకుని దర్శకుడు ఈ సినిమాని చిత్రీకరించారు. 'రంగం' సినిమాతో దర్శకుడిగా తన టాలెంట్‌ ప్రదర్శించిన కె.వి.ఆనంద్‌ ఈ సినిమాకి దర్శకుడు. మలయాళ సూపర్‌ స్టార్‌ మోహన్‌లాల్‌ కీలక పాత్ర పోషించారు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS