తెలుగులో సంచలన విజయం అందుకున్న ‘అర్జున్‌రెడ్డి’ని హిందీలో ‘కబీర్‌సింగ్’ పేరుతో రీమేక్ చేశాడు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా. హిందీలోనూ ఈ సినిమా ఊహించని విధంగా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. బాక్సాఫీస్ రికార్డులు కొల్లగొట్టింది. ఈ సినిమాతో ఏకంగా ముద్దుగుమ్మ కియారా అద్వానీ కెరీరే టర్న్ అయిపోయింది. అలాంటిది డైరెక్టర్‌గా మన రెడ్డిగారి దశ ఏ రేంజ్‌లో తిరిగిపోతుందో అనుకున్నారంతా. నిజంగానే ఆ సినిమా సక్సెస్ టైమ్‌లో చాలా మంది బాలీవుడ్ హీరోలు సందీప్ రెడ్డితో సినిమాలు చేసేందుకు ఊగిసలాడారనే వార్త కూడా వినిపించింది. ఆ లెక్కల్లో మనోడు రెండు, మూడు బాలీవుడ్ ప్రాజెక్టులు లైన్‌లో పెట్టేశాడనే టాక్ కూడా బాగా సర్క్యులేట్ అయ్యింది. దాంతో సందీప్ రెడ్డి ఇప్పట్లో బాలీవుడ్ వదిలి టాలీవుడ్‌కి వచ్చే అవకాశమే లేదనుకున్నారంతా.
కానీ అదంతా ఉత్తదే అని తేలిపోయింది. బాక్సాఫీస్‌ని షేక్ చేసే రేంజ్‌లో హిట్ కొట్టినా మనోడ్ని అక్కడి హీరోలు లెక్క చేయలేదనేది తాజా వార్త. తనదైన శైలిలో ట్రైల్స్ వేసి వేసి, వర్కవుట్ అవదనుకున్నాడో ఏమో, సందీప్ రెడ్డి టాలీవుడ్‌కి మకాం షిఫ్ట్ చేశాడనీ తెలుస్తోంది. త్వరలోనే ఓ యంగ్ హీరోతో సినిమా తెరకెక్కించనున్నాడట. అందుకోసం ఓ ప్రముఖ నిర్మాణ సంస్థకు సందీప్‌రెడ్డి కమిట్ అయ్యాడనీ ఫిలిం నగర్ టాక్. విజయ్ దేవరకొండను రౌడీగా మలచిన క్రెడిట్‌ని సింపుల్ గా కొట్టేసిన సందీప్‌రెడ్డి ప్రస్తుతం ఏ యంగ్‌హీరోని లాక్ చేశాడో తెలియాంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.