పాపం మెహ్రీన్.. ‘లోకల్‌ బాయ్‌’ అయినా కలిసొస్తాడా?

By Inkmantra - February 18, 2020 - 11:10 AM IST

మరిన్ని వార్తలు

ఈ సంక్రాంతికి ‘ఎంత మంచి వాడవురా’ సినిమాతో కళ్యాణ్‌రామ్‌కి జోడీగా వచ్చిన మెహ్రీన్‌ బాక్సాఫీస్‌ పోరులో నిలదొక్కుకోలేకపోయింది. కామ్‌గా రేస్‌లోంచి పక్కకి తప్పుకోవల్సి వచ్చింది. కానీ, ఈ సారి పవర్‌ఫుల్‌ ‘లోకల్‌ బాయ్‌’ ధనుష్‌ని వెంటేసుకుని వస్తోంది. ధనుష్‌ ` మెహ్రీన్‌ జంటగా తెరకెక్కిన ‘పటాస్‌’ చిత్రం తెలుగులో ‘లోకల్‌ బాయ్‌’ టైటిల్‌తో రిలీజ్‌ అవుతోంది. శ్రీమతి జగన్మోహిణి సమర్పణలో విఘ్నేశ్వర ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌లో సి.హెచ్‌. సతీష్‌ కుమార్‌ ఈ సినిమాని తెలుగులో రిలీజ్‌ చేస్తున్నారు. రీసెంట్‌గా రిలీజ్‌ అయిన ‘లోకల్‌ బాయ్‌’ ట్రైలర్‌కి మంచి రెస్పాన్స్‌ వచ్చింది. మార్షల్‌ ఆర్ట్స్‌ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాకు తమిళంలో మంచి ఆదరణ దక్కింది.

 

ఈ తరహా కాన్సెప్ట్స్‌ని అన్ని భాషల్లోనూ ఆడియన్స్ ఆదరిస్తారు. అందుకే తెలుగులోనూ రిలీజ్‌ చేసేందుకు సన్నాహాలు జరిగాయి. ఈ క్రమంలో ఫిబ్రవరి 28న ‘లోకల్‌ బాయ్‌’ ప్రేక్షకుల ముందుకు వస్తోంది. స్నేహ కీక పాత్ర పోషించిన ఈ సినిమాలో యంగ్‌స్టర్‌ నవీన్‌ చంద్ర విలన్‌ పాత్ర పోషించాడు. హీరోయిన్‌ మెహ్రీన్‌ విషయానికి వస్తే, ‘ఎఫ్‌ 2’తో గతేడాది సూపర్‌ హిట్‌ కొట్టింది. ఈ ఏడాది తమిళంలో ‘పటాస్‌’ బ్లాక్‌ బస్టర్‌ అయ్యింది కానీ, తెలుగులో ఇంకా హిట్ టేస్ట్ చూడలేదు ‘ఎంత మంచి వాడవురా’ నిరాశ పరిచింది. ఆ వెంటనే వచ్చిన ‘అశ్వథ్ధామ’తోనూ డీలా పడింది . మరి డబ్బింగ్‌ మూవీ ‘లోకల్‌ బాయ్‌’ అయినా మెహ్రీన్‌కి కలిసొస్తుందేమో చూడాలిక.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS