అర్జున్ రెడ్డి తరవాత.. తెలుగులో మరో సినిమా తీయలేకపోయడు సందీప్ రెడ్డి వంగా. అదే కథని బాలీవుడ్ తీసుకెళ్లి సూపర్ హిట్టు కొట్టాడు గానీ, టాలీవుడ్ లో నెం.2 సినిమా పట్టాలెక్కించలేకపోయాడు. సందీప్ కి కూడా వెంట వెంటనే సినిమా మొదలెట్టేయాలన్న తొందర లేకపోవడం, హీరోలూ అందుబాటులో లేకపోవడం వల్ల - సందీప్ రెండో ప్రాజెక్టు ఆలస్యం అయ్యింది.
అయితే.. ఇప్పుడు సందీప్ నుంచి మరో సినిమా రావడానికి రంగం సిద్ధం అవుతున్నట్టు టాక్. రామ్ చరణ్‌తో సందీప్ ఓ సినిమా చేయబోతున్నాడట. అందుకు సంబంధించి చర్చలు మొదలయ్యాయని తెలుస్తోంది. అర్జున్ రెడ్డి తరవాత ఓ స్టార్ హీరోతో సినిమా చేయడానికి కథ రెడీ చేసుకున్నాడు సందీప్. మహేష్ బాబుతోనూ సంప్రందింపులు జరిగాయి. కానీ.. ఆ ప్రాజెక్ట్ వర్కవుట్ అవ్వలేదు.
ఇప్పటికి సందీప్ రెడ్డికి హీరో దొరికినట్టైంది. `ఆర్.ఆర్.ఆర్` తరవాత చరణ్ మరే సినిమాకీ కమిట్ కాలేదు. సందీప్ రెడ్డితో ప్రాజెక్టు సెట్ అయితే.. ఈ సినిమానే మొదలెడతారు. ఇప్పటికే సందీప్ దగ్గర స్క్రిప్టు రెడీగా ఉంది. కాబట్టి.. 2021లో ఈ సినిమాని పట్టాలెక్కించడం ఖాయంగా కనిపిస్తోంది.