డ్రగ్స్ కేసులో రకుల్ ప్రీత్ సింగ్ పేరు బయటకు రావడం, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్‌సీబీ) రకుల్ కి నోటీసులు పంపడం తెలిసిన విషయాలే. ముందు నాకు ఎలాంటి నోటీసులూ రాలేదని చెప్పిన రకుల్ చివరకు `వచ్చాయి` అంటూ నిజం ఒప్పుకుంది ఈ రోజు ముంబైలో ఎన్‌సీబీ అధికారుల ముందు విచారణకు హాజరు కానుంది రకుల్. శనివారం దీపిక పదుకొణెని అధికారులు విచారిస్తున్నారు.
ఈ విచారణలో రకుల్ ని ఏం అడుగుతారు? ఆమె నుంచి అధికారులు ఎలాంటి సమాధానాలు ఆశిస్తున్నారు? రకుల్ ని ఇబ్బంది పెట్టేశా సాక్ష్యాధికారాలు ఎన్ సీ బీ దగ్గర ఏమున్నాయి? అనేవి ఆసక్తి ని కలిగిస్తున్నాయి. రియాని కూడా ఇలానే విచారణకు పిలిచి, ఆ తరవాత అరెస్ట్ చేశారు. రకుల్ నీ అలానే అరెస్టు చేస్తారా? లేదంటే విచారించి వదిలేస్తారా? అన్న ప్రశ్నలు ఇప్పుడు అందరి మదిలో మెదులుతున్నాయి.
రకుల్ ని ఈరోజు విచారించి వదిలేస్తే ఫర్వాలేదని, మరోసారి కూడా విచారణకు రమ్మంటేనే కష్టమని, అదే జరిగితే రకుల్ ఈ కేసులో కూరుకుపోయినట్టే అంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి.