'బుజ్జిగాడు' సినిమాతో త్రిష చెల్లెలిగా ముద్దులొలికే మాటలతో ఆకట్టుకున్న బ్యూటీ సంజన. హీరోయిన్గా పెద్దగా అవకాశాలు రాకపోయినా, ప్రత్యేక పాత్రల్లో ఫ్యాన్స్‌కి దగ్గరగా ఉంటూ వస్తోంది. గ్లామరస్ పాత్రలే కాకుండా, కొన్ని స్పెషల్ క్యారెక్టర్స్నీ బాగానే టేకప్ చేస్తోంది ఈ మధ్య సంజన. 'దండుపాళ్యం - 2' సినిమాలో డిఫరెంట్ రోల్లో నటించి, నటన పరంగా అందరి ప్రశంసలు అందుకుంది. కాగా ఇప్పుడు బుల్లితెరపై అడుగు పెట్టబోతోంది. సౌత్‌లో రూపొందుతోన్న ఓ టీవీ సిరీస్‌లో సంజన నటిస్తోంది. మహారాణి పాత్రలో సంజన కనిపించబోతోందట. వెండితెరపై 'బాహుబలి' సృష్టించిన అద్భుతం అంతా ఇంతా కాదు. రికార్డులు బద్దలు కొట్టేసింది ఆ సినిమా. అయితే బుల్లితెర రికార్డుల్ని ఈ తాజా సిరీస్ బద్దలు కొట్టబోతోందని సంజన చెబుతోంది. 'బాహుబలి' తరహాలో ఈ సీరియల్ ఉండబోతోందట. ఇందులో సంజన కత్తి యుద్ధాలు, పోరాట ఘట్టాలు చేస్తుందట. ఈ సిరీస్ ద్వారా ప్రేక్షకులకు బాగా దగ్గరవుతాననీ అంటోంది ఈ ముద్దుగుమ్మ సంజన. ఇదిలా ఉండగా, మరో బ్యూటీ కార్తీక కూడా ఇదే తరహా బుల్లితెర సిరీస్‌లో నటిస్తోంది. 'ఆరంభ్' పేరుతో ఈ సీరియల్ చిత్రీకరణ జరుగుతోంది. గతంలోనే ఈ సీరియల్లో కార్తీక గెటప్‌కి సంబంధించిన కొన్ని ఫోటోలు హల్చల్ చేశాయి. దేవసేన పాత్రలో కనిపిస్తోంది కార్తీక. కార్తీక కూడా కత్తి పట్టి యుద్ధాలు చేసేస్తోంది ఈ సీరియల్ కోసం. అచ్చం 'బాహుబలి' దేవసేన అనుష్కలాగే. అయితే ఈ ఇద్దరు ముద్దుగుమ్మలు బుల్లితెరపై మహారాణులుగా మెరిసిపోన్నారన్న మాట. మెరిసిపోవడమేంటి, 'బాహుబలి' సినిమాని బుల్లితెరపై మళ్లీ సరికొత్తగా చూపిస్తామంటుంటేనూ!